తన వైఫై ఇతరులు వాడొద్దని వింత యూజర్‌ నేం పెట్టుకున్న వ్యక్తి.. ఇప్పుడు అతడిని చిక్కుల్లో పడేసింది  

  • దేశ రాజధాని ఢిల్లీలో వింత సంఘటన జరిగింది. తన ఇంటర్నెట్‌ వైఫైను ఇతరులు పదే పదే వాడుతున్నారని, తన ఇంటి పక్కన ఉన్న వారు ఏ పాస్‌ వర్డ్‌ పెట్టినా కూడా వదలకుండా హ్యాక్‌ చేసి తన నెట్‌ను వాడేసుకుంటున్నారు అంటూ అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన నెట్‌ను ఎవరు వాడుతున్నారో అతడికి అర్థం కాకపోయేది.

  • Gulshan Tiwari Wifi UserName Puts Him Into Trouble-Telugu Viral Viral In Social Media Telugu Wi-fi Username Terrorised Trouble

    Gulshan Tiwari Wifi UserName Puts Him Into Trouble

  • దాంతో అతడు పదే పదే పాస్‌ వర్డ్‌లు మార్చేవాడు, అయినా కూడా ఎలా తెలిసి పోయేదో కాని వారు మళ్లీ మళ్లీ ఆ పాస్‌ వర్డ్‌లను బ్రేక్‌ చేస్తూ వచ్చారు. దాంతో అతడు తన యూజర్‌ నేమ్‌ను అత్యంత విభిన్నంగా మార్చుకున్నాడు. దాంతో ఎవరు కూడా ఆ వైఫైను టచ్‌ చేసేందుకు సాహసం చేయలేదు.

  • Gulshan Tiwari Wifi UserName Puts Him Into Trouble-Telugu Viral Viral In Social Media Telugu Wi-fi Username Terrorised Trouble
  • ఢిల్లీకి చెందిన గుల్షన్‌ తివారీ అనే వ్యక్తి తన వైఫై యూజర్‌ నేమ్‌ను జాయిన్‌ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ గా మార్చాడు. ఉగ్రవాద సంస్థ అయిన ఆ పేరు చూడగానే అంతా కూడా భయపడ్డారు. పదే పదే తన నెట్‌ను వినియోగించుకుంటున్న వ్యక్తులు మరోసారి తన నెట్‌ ను వాడవద్దనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే గుల్షాన్‌ తివారీని ఎంక్వౌరీ చేశారు. తాను మరే ఉద్దేశ్యంతో ఆ యూజర్‌ నేమ్‌ పెట్టలేదని, తన నెట్‌ను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారనే ఉద్దేశ్యంతో తాను ఇలా చేశాను అంటూ అతడు చెప్పుకొచ్చాడు.

  • Gulshan Tiwari Wifi UserName Puts Him Into Trouble-Telugu Viral Viral In Social Media Telugu Wi-fi Username Terrorised Trouble
  • దాదాపు మూడు నాలుగు వారాల పాటు అతడిని విచారించిన పోలీసులు చివరకు నిర్ధోశిగా వదిలేశారు. నెట్‌ను వినియోగిస్తున్నారంటూ అతడు చేసిన వింత పనితో పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఇలాంటి పిచ్చి పనులు మరోసారి చేయవద్దని హెచ్చరించి పోలీసులు అతడిని వదిలి పెట్టినట్లుగా తెలుస్తోంది. మరో వైపు గుల్షన్‌ నెట్‌ను ఎవరైనా వినియోగిస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడం జరిగింది.