ఫిల్మ్ ఫేర్ లో సత్తా చాటిన గల్లీ బాయ్!  

Gully Boy Creates History In Filmfare Awards - Telugu Aliya Bhatt, Bollywood, Filmfare Awards, Gully Boy Creates History, Indian Cinema

బాలీవుడ్ లో వచ్చిన గల్లీబాయ్ సినిమా ఇంచు మించు ప్రతి ఒక్కరు చూసి ఉంటారు.మన గల్లీలో జరిగే నిజ జీవిత కథలకి దగ్గరగా ఉండే ఈ సినిమా చాలా నేచురల్ ప్రెజెంటేషన్ తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ రాబట్టింది.

Gully Boy Creates History In Filmfare Awards - Telugu Aliya Bhatt, Bollywood, Filmfare Awards, Gully Boy Creates History, Indian Cinema-Movie-Telugu Tollywood Photo Image

దీంతో ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే రణబీర్ సింగ్, అలియా భట్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్ లో సత్తా చాటింది.

ప్రధానమైన అవార్డులన్నీ గల్లీబాయ్ కే సొంతం అయ్యాయి.ఏకంగా ఏడు విభాగాల్లో ఈ సినిమా విజేతగా నిలిచింది.ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటీనటులు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీతం తదితర విభాగాల్లో ఈ గల్లీబాయ్ అవార్డులను సొంతం చేసుకుంది.ఆర్టికల్‌ 15 రెండు అవార్డులతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

ఉత్తమ సినిమా క్రిటిక్స్‌, ఉత్తమ నటుడు క్రిటిక్స్‌ విభాగాల్లో అవార్డులను గెలుచుకుందీ.ఈ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక అస్సాంలోని నిర్వహించారు.

దీంతో అస్సాం బాలీవుడ్‌ స్టార్స్‌తో సందడి నెలకొంది.ఈ వేడుకకు రణవీర్‌ సింగ్‌, ఆలియా భట్‌, ఆయుష్మాన్‌ ఖుర్రానా, మాధురి దీక్షిత్‌, పూజా హెగ్డే తదితరులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

తాజా వార్తలు

Gully Boy Creates History In Filmfare Awards-bollywood,filmfare Awards,gully Boy Creates History,indian Cinema Related....