దూసుకొస్తున్న 'గులాబ్' తుఫాన్.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది అది మరింత బలపడి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వైపు శరవేగంగా పయనిస్తుంది.ఫలితంగా శనివారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది.

 Gulab Storm Looming State Government Alerte-TeluguStop.com

ప్రస్తుతం ఈ వాయుగుండం గోపాలపూర్ కు ఆగ్నేయ దిశలో 670 కిలో మీటర్ల కళింగపట్నానికి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.ఇది తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది.

ఆదివారం సాయంత్రానికి విశాఖపట్నం కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఈ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

 Gulab Storm Looming State Government Alerte-దూసుకొస్తున్న గులాబ్’ తుఫాన్.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది.

తుపాన్ కు గులాబ్ గా నామకరణం చేశారు.తుఫాన్ ప్రభావం వల్ల శనివారం సాయంత్రం నుంచి కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి.

అయితే ఆది సోమవారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.ఆదివారం తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

దీంతో మత్స్యకారులు సోమవారం వరకు వేటకి వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆ దిశగా సముద్ర తీర ప్రాంతాల్లో స్థానిక అధికారులు దండోర కూడా వేశారు.

#Gulab #Bangala Katham #Allert #Uttarandra #Disaster

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు