40 ఏళ్ళు అయినా కూడా అదే ఫిజిక్,ఫిదా అవుతున్న నెటిజన్లు

ఒకప్పుడు వెండి తెరను ఏలిన నటి అయినప్పటికీ పెళ్లి, పిల్లలు తరువాత వారిలో ఖచ్చితంగా మార్పు వస్తూ ఉంటుంది.ఈ జనరేషన్ లో మాత్రం ఒకప్పటి హీరోయిన్స్ అయినా కూడా ఇప్పటికీ మాత్రం ఫిజిక్ ను మైంటైన్ చేసుకుంటున్నారు.

 Gul Panags 20 Year Old Maldives Pic Stuns Netizens-TeluguStop.com

అలాంటి వారిలో కరీనా కపూర్,శిల్పా శెట్టి,జెనీలియా,మలైకా అరోరా ఇలా చెప్పుకుంటే పొతే దాదాపు ఈ జనరేషన్ లో అందరూ కూడా తమ ఫిజిక్ పై మంచి శ్రద్ధ పెడుతున్నారు.అయితే తాజాగా నాలుగు పదుల వయసులో కూడా బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ఒక ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇంతకీ ఆ ఫోటో లో ఏముంది అని అనుకుంటున్నారా.ఎప్పుడో 1999 లో మాల్దీవుల్లో బికినీ వేసుకొని దిగిన ఫోటో తో పాటు ఇటీవల అదే ప్రదేశంలో సేమ్ ఆ 20 ఏళ్ల నాటి బికినీ నే ధరించి దిగిన ఫోటోను జత చేసి పోస్ట్ చేసింది.

అయితే ఆ ఫోటో లో అప్పటి గుల్ పనాగ్ కు ఇప్పుడు లేటెస్ట్ ఫోటో ని కంపేర్ చేసుకుంటే ఇంతంటే ఇంత కూడా మార్పు లేకుండా ఒకేలా ఉండడం విశేషం.ఈ ఫోటో చూసిన నెటిజన్లు,సీని ప్రముఖులకు కూడా ఆమె ఫిజిక్ చూసి మతిపోతుంది అంటే నమ్మరు.

నిజంగా నాలుగు పదుల వయసులో కూడా ఆమె అదే విధంగా తన ఫిజిక్ ని మైంటైన్ చేయడం పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.కొందరైతే తమదైన శైలి లో సెటైర్లు కూడా వేస్తున్నారు అనుకోండి.

ఆమె మాత్రం ఆ ఫోటోలను పోస్ట్ చేసి ‘20 ఏళ్ల త్వాత మళ్లీ మాల్దీవ్స్‌కి వచ్చాను.ఇప్పటికీ నా మార్క్స్ అండ్ స్పెన్సర్ బికినీ ఏమాత్రం పాడవలేదు’ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

అప్పటికి ఇప్పటికి ఆమెలో ఏలాంటి మార్పు లేదని, ఇప్పటికీ అంతే సెక్సీగా, అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఎందరో యువతులకు ఫిట్‌నెస్ పరంగా గుల్ పనాగ్ స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె వయసు 40 ఏళ్లుగా తెలుస్తుంది.

2003లో ధూప్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన గుల్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడం తో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.

అయితే ఇటీవల రాజకీయాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావించిన గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఆమె స్వస్థలం అయినా చండీగఢ్ నుంచి 2014 లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube