తమ ప్రధాని ఎంతటి విద్యావంతుడో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?

సమాచార హక్కు చట్టం ద్వారా మోడీ ( PM Modi ) విద్యార్హత గురించి ప్రశ్నించిన డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు( Aravind Kejriwaal ) గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది.అది అవసరం లేని సమాచారం అని పేర్కొన్న కోర్టు, తమ సమయం వృధా చేసినందుకు కేజ్రీవాల్ కు 25 వేల రూపాయలు జరిమానా విధించింది నాలుగు వారాల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

 Gujarath High Court Fine Kejriwal For Asking Eductional Status Of Modi Details,-TeluguStop.com

దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేజ్రీవాల్ తమ ప్రధాని ఎంతటి విద్యావంతుడో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా అని ట్వీట్ చేశారు.అతను సాధారణ పద్ధతుల్లో డిగ్రీ పట్టా పొంది ఉంటే దానిని బహిర్గత పరచడానికి ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

మోడీ విద్యార్హత తెలుసుకోవడం కోసం 2016లో సమాచార హక్కు ద్వారా ప్రశ్నించిన కేజ్రీవాల్ కు ఆయన రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ చేశారని ప్రథమ శ్రేణి లో ఉత్తీర్ణులయ్యారని సమాచార శాఖా కమిషనర్ జవాబు ఇచ్చారు.

Telugu Cmaravind, Delhi Cm, Kejriwal, Gujarath, Modi Degreee, Tushar Mehta-Telug

దానికి కొనసాగింపుగా ఢిల్లీ యూనివర్సిటీ విసీకి లేఖ రాసిన కేజ్రీవాల్ మోడీ డిగ్రీ పట్టాను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచాలని కోరారు.దీనిపై సదరు యూనివర్సిటీ కోర్టుకు వెళ్ళగా సుదీర్ఘ విచారణ అనంతరం ఇప్పుడు తీర్పు వచ్చింది .యూనివర్సిటీ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటెడ్ జనరల్ తుషార్ మెహతా ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం వహించడానికి చదువు అడ్డంకి కాదని ,అలాంటప్పుడు అవసరం లేని విషయాల్లో అత్యుత్సాహం చూపించడం బాధ్యత రాహిత్యం కిందకు వస్తుందని , ఇది పిల్ల చేష్ట లా ఉందని దీని వల్ల ప్రజలకి ప్రయోజనం లేదని వాదించారు.అంతేకాకుండా ప్రజా ప్రయోజన విషయంలోనే సమాచార హక్కు చట్టం ఉపయోగించాలని రాజకీయ ప్రతీకారాల కోసం కాదని ఆయన ఈ సందర్భంగా తన వాదన వినిపించారు.

Telugu Cmaravind, Delhi Cm, Kejriwal, Gujarath, Modi Degreee, Tushar Mehta-Telug

ఇరువైపుల వాదనలు విన్న కోర్టు అనవసర సమాచారం అడిగినందుకు కేజ్రీవాల్ కు జరిమానా వీదిoచింది .ఈ తీర్పుపై ప్రజల్లో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగినందుకు తగిన ఫలితం దొరికిందని బిజెపి( BJP ) శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తుండగా కేవలం విద్యార్హత అడిగినందుకు జరిమానా విధించడం సహహికంగా సహేతుకంగా లేదంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు.ఏది ఏమైనా న్యాయమూర్తులకు పదవులు ఇచ్చే సంస్కృతి మొదలైన తర్వాత తీర్పుల్లో నిష్పక్షపాతం ఉండడం లేదని తీర్పులను కూడా అనుమాన దృష్టితో చూడాల్సిన పరిస్థితిలో వచ్చాయి అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు….

మరి ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారో చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube