నేను విష్ణుమూర్తి అవతారం.. గ్రాట్యూటీ ఇవ్వకపోతే.. హల్ చల్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి!

నేను విష్ణుమూర్తి అవతారం అంటూ ఒక ప్రభుత్వ మాజీ ఉద్యోగి హల్ చల్ చేస్తున్నాడు.గుజరాత్ రాష్ట్రము లోని ప్రభుత్వ మాజీ ఉద్యోగి రమేష్ చంద్ర ఫెఫర్ తాను దేవుడని చెప్పి తనకు రావాల్సిన గ్రాట్యూటీ ఇవ్వాలని, అంతేకాదు ఏడాది జీతం వెంటనే ఇవ్వకపోతే ఈ ప్రపంచాన్ని కరువు కాటకాలకు గురి చేస్తానని నానా హంగామా చేస్తూ మరొక సారి వార్తల్లోకి ఎక్కారు.

 Gujarat Man Who Claims To Be Lord Vishnu Incarnate Warns Of Drought If His Gratu-TeluguStop.com

అయన ఆఫీసుకు సరిగ్గా రాకపోవడం, మానసిక స్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో ఆయనకు ముందస్తు రిటైర్మెంట్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.అయన మానసిక స్థితి సరిగ్గా లేని కారణంగా తనని తాను దేవుడితో పోల్చుకుంటూ ప్రపంచం మొత్తం కరువు కారకాలను సృష్టిస్తానని నాకు ఆ శక్తి ఉందంటూ ఆయన హల్ చల్ చేస్తున్నాడు.

ఈ విషయం పై రమేష్ చంద్ర గుజరాత్ జలవనరుల శాఖ అధికారులకు ఒక లేఖ రాసారు.

Telugu Gratuity Demand, Kalki, Vishnumurthy-Latest News - Telugu

ఈ లేఖలో రామేష్ చంద్ర ప్రభుత్వం లో ఉన్న దెయ్యాలు తనని వేధిస్తున్నాయని తన గ్రాట్యూటీ, జీతం రాకుండా అడ్డుకుంటున్నాయని అందులో పేర్కొన్నారు.రావాల్సిన గ్రాట్యూటీ 16 లక్షలు, సంవత్సర జీతం 16 లక్షలు తనకు రాకుండా ఆ దెయ్యాలు చేస్తున్నాయని ఆయన లేఖలో రాశారు.అంతేకాదు అందులో రమేష్ చంద్ర గత రెండు దశాబ్దాలుగా మంచిగా వర్షాలు పడడానికి తన కల్కి అవతారమే కారణమని పెకొన్నాడు.

ప్రభుత్వానికి ఈ రెండు దశాబ్దాలలో 20 లక్షల కోట్లు ఆదాయం రావడానికి నేనే కారణం అంటూ ఆయన పేర్కొనడం గమనార్హం.ఇంత చేస్తున్న దెయ్యాలు నన్ను వేధిస్తున్నాయని అందుకే కరువు కాటకాలు సృష్టించి వినాశనం తీసుకువస్తా అని ఆయన చెబుతున్నాడు.

దీనిపై అధికారులు మాట్లాడుతూ.రమేష్ చంద్ర ఉద్యోగానికి రాకుండానే, దేవుడి అవతారం అంటూ జీతం చెల్లించ మంటున్నారని చెబుతున్నారు.

అయన మానసిక స్థితి సరిగా లేని కారణంగా ఆయనకు ముందస్తు రిటైర్మెంట్ కు అనుమతి ఇచ్చారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube