భార్య లావుగా ఉందని ఇంట్లో నుంచి గెంటేసిన భర్త!  

Gujarat Man Taunts Wife for Fat, Gujarat man, taunts wife, she is fat, abandons her - Telugu Abandons Her, Gujarat Man, Gujarat Man Taunts Wife For Fat, She Is Fat, Taunts Wife

అనుష్క శెట్టి నటించిన సైజ్ జీరో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో అనుష్క లావు వల్ల పెళ్లి సంబంధాలు అన్ని చెడిపోతుంటాయ్.

TeluguStop.com - Gujarat Man Taunts Wife Fat Abandons Her

అయితే ఓ వ్యక్తి ఆమెను హేళన చేసి మాట్లాడటంతో ఆమె ఒక డైలాగ్ వేస్తుంది.గుర్తుందా? పెళ్లికి ముందు లావుగా ఉంటే పెళ్లి చేసుకోరు పెళ్లి తర్వాత భార్య లావు అవుతే వదిలేస్తారా? అని.ఆ ప్రశ్నకు ఇప్పుడు నిజంగానే సమాధానం దొరికింది.
అందానికే విలువ ఇచ్చే ఓ వ్యక్తి భార్య లావుగా ఉందని ఇంట్లో నుంచి గెంటేశాడు ఓ భర్త.

ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

TeluguStop.com - భార్య లావుగా ఉందని ఇంట్లో నుంచి గెంటేసిన భర్త-General-Telugu-Telugu Tollywood Photo Image

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో న్యూ వదాజ్‌కు చెందిన 24 ఏళ్ల మాయ అనే మహిళ మూడు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన లలిత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి జరిగిన తర్వాత ఆరు నెలల వరకు వీరి కాపురం చాలా సజావుగానే సాగింది.

కానీ ఆ తర్వాత నుంచి భర్త తన భార్యను లావుగా ఉన్నావు అంటూ వేధించడం ప్రారంభించాడు.ఇంత లావుగా ఉంటే ఎంతమాత్రం ఇష్టం లేదని తన తల్లిదండ్రులు బలవంతం వల్ల ఆమెను పెళ్లి చేసుకున్నట్టు చెప్పి ఆమెను ఎగతాళి చేసి మాట్లాడేవాడు.

ఇలా మాట్లాడటమే కాకుండా పుట్టింటి నుంచి ఇల్లు కొనేందుకు డబ్బు తీసుకురావాలని ఆమెను వేధించేవాడు.

ఇక ఆతర్వాత ఆమెను ఇంటి నుంచి అతను గెంటేసినట్లు పోలీసులకు తెలిపింది.

భర్త, అత్తింటి వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె తెలిపింది.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.సైజు జీరో సినిమా డైలాగ్ ను నిజం చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

#GujaratMan #Gujarat Man #Taunts Wife #Abandons Her

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gujarat Man Taunts Wife Fat Abandons Her Related Telugu News,Photos/Pics,Images..