మాస్క్ వేసుకోక పొతే టెస్ట్ చేయించుకోవాల్సిందే... ఎక్కడంటే!

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తుండడం తో ప్రపంచ దేశాలు అప్రమత్తమౌతున్నాయి.ఈ క్రమంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా ఈ కోవిడ్ ను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Gujarat Government Take An Order Mandatory To Wearing Mask In Public Place, Coro-TeluguStop.com

భారత్ లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది.ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

దేశంలో కరోనా రెండో విడత విజృంభనను అడ్డుకునేందుకు అనేక ప్రయాత్నాలను చేస్తున్న క్రమంలో గుజరాత్ మరో అడుగు ముందుకేసింది.మాస్క్ ధరించడం తప్పనిసరీ చేసింది.

ఒకవేళ ఎవ్వరైనా గనుక మాస్క్ వేసుకోకపోతే జరిమానా విధించి వేదిలేస్తుంది అని అనుకుంటున్నారో ఏమో.అదేమీ లేదు ఎవరైనా మాస్క్ ధరించకపోతే వారికి యాంటీ జెంట్స్ పరీక్ష చేసి మరి వారికి కరోనా పాజిటివ్, నెగిటివ్‌లను నిర్ధారిస్తారట.

ఒకవేల ఎవరైనా మాస్క్ ధరించని వారికి కరోనా పాజిటివ్ వస్తే వారిని క్వారంటైన్ పంపి వెయ్యి రూపాయల జరిమానాను విధిస్తారు, కరోనా నెగిటివ్ వస్తే మాత్రం కేవలం జరిమానా మాత్రమే విధిస్తారట.అయితే ఈ సమాచారాన్ని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపడం తో ఇప్పుడు గుజరాత్ ప్రజలు అందరూ హడలి పోతున్నారు.

కరోనా మహమ్మారి కంటే కూడా యాంటీ జెన్ టెస్ట్ కోసమే చాలా మంది భయపడిపోతున్నారు.మరి ఇలా మాస్క్ పెట్టుకొని ప్రతి ఒక్కరికీ కూడా ఈ టెస్ట్ అంటేనే జనాలు హడలి పోతున్నారు.

కరోనా దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని రాష్ట్రాలు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.అందుకే గుజరాత్ రాష్ట్రం కూడా ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకోవడం తో అందరూ హర్షిస్తున్నారు.

Telugu Corona, Corona Wave, Covid, Gujarath, Gujarathstrict-Latest News - Telugu

ఇప్పటికే ఢిల్లీ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడం తో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ విధించాలి అని ఆలోచన చేస్తుంది.ఇలాంటి సమయంలో గుజరాత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మరిన్ని రాష్ట్రాలు ఆలోచనలో పడేలా చేస్తుంది.మరి గుజరాత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కరోనా కట్టడి అనేది సాధ్యం అవుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube