నోటితోటే గిన్నీస్ రికార్డు నెల‌కొల్పిన‌ మ‌హిళ‌..!

మ‌నం సాధార‌ణంగా ఎన్నో ర‌కాల రికార్డులు చూస్తూనే ఉన్నాం.ఇప్ప‌టికే చాలా మంది ఎన్నో ప్ర‌యోగాలు చేసి గిన్నీస్ బుక్‌ల‌లో రికార్డు నెల‌కొల్పేందుకు ట్రై చేస్తున్నారు.

 Guinness World Record Breaking Woman With A Mouth-TeluguStop.com

చాలామంది మంట‌ల్లో న‌డ‌వ‌డం లేదా వివిధ ర‌కాలుగా త‌మ ట్యాలెంట్‌ను నిరూపించుకుని రికార్డు నెల‌కొల్ప‌తూ ఉంటారు.ఇక ఇప్పుడు కూడా అలాంటి ఓ వింత గిన్నీస్ బుక్ రికార్డు గురించే మ‌నం చెప్పుకోబోయేది.

అయితే ఆమె చేసిన ప‌ని తెలిస్తే మీరు కూడా ఆశ్చ‌ర్య‌పోతారు.ఇక ఇప్పుడు ఫేమ‌స్ అయిన టిక్ టాక్ ద్వారా మంచి ఇమేజ్ సంపాదించుకుంది ఒ 31ఏళ్ల సమంతా రామ్‌స్‌డెల్‌.

 Guinness World Record Breaking Woman With A Mouth-నోటితోటే గిన్నీస్ రికార్డు నెల‌కొల్పిన‌ మ‌హిళ‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇత‌లా పేరు తెచ్చుకున్న ఈమె ప్ర‌స్తుతం అమెరికాలో నివసిస్తోంది.కాగా ఆమెకు ఉన్న విశేషం ఏంటంటే ఆమె నోరు ఏకంగా 6.52 సెంటీమీటర్లు ఉంటుంద‌ని తెలుస్తోంది.కాగా ఆమె దవడలు మాత్రం ఎంత‌ పెద్దగా అంటే అంత పెద్ద‌గా సాగిపోతున్నాయంట‌.

ఇక ఈ విష‌యం తెలుసుకుని గిన్నీస్ బుక్ వారు కొలతలు తీసుకుని మ‌రీ ఆమెపై పరిశీలనలు చేశారంట‌.ఇక దాని అనంతరం అస‌లు నిజంగానే ప్రపంచంలోనే అతిపెద్ద నోరు ఈమెకు ఉంద‌ని, అతి పెద్ద నోరు కలిగిన మహిళగా స‌మంతా ను కన్ఫామ్ చేశారు గిన్నీస్ బుక్ వారు.

Telugu 6.52 Cms Of Big Mouth, America, Apple, Big Mouth, Guinness World Record, Samantha, World Record, Worlds Biggest Mouth-Latest News - Telugu

అయితే స‌మంతా నోరు చిన్న వయస్సు నుంచే చాలా పెద్దగా ఉంటుందని ఆమెకు ఆ ప్ర‌త్యేక‌త ఉంద‌ని చాలా మందికి తెలుసంట‌.ప్ర‌స్తుతం స‌మంతా కు చెందిన చిన్ననాటి పిక్స్ కూడా నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.అయితే స‌మంతా కుటుంబంలో ఎవ్వరికీ అన‌గా ఆమె ఫ్యామిలీలో ఇంత పెద్దగా ఉన్న సైజులో నోరు లేద‌ని గిన్నీస్ అధికారులు చెబుతున్నారు.కేవ‌లం ఒక్క సామ్ ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది.

అయితే ఆమె నోటి సైజు చెప్పాలంటే ఆమె నోట్లో ఏకంగా ఒక ఆపిల్ మొత్తం పట్టేంత ఆమె త‌న నోరును తెరుస్తుంద‌ని స‌మాచారం.

#Samantha #Big Mouth #America #Cms Big Mouth #Apple

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు