నూతన దంపతులకు ఆదర్శవంతమైన గిఫ్ట్స్ ఇచ్చిన గెస్ట్‌... సూపర్ ఐడియా!

రోజురోజుకీ సోషల్ మీడియా పరిధి పెరుగుతున్న వేళ ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలు ఒకేతాటిపైకి వస్తున్నాయి.అనేక వీడియోలు నెటిజన్లను రంజింపజేస్తున్నాయి.

 Guest Distributed Helmets To New Couple In Bihar Wedding Details, Bride, Groom ,-TeluguStop.com

వీటిలో ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుండటం మనం చూస్తున్నాం.తాజాగా బీహార్‌ రాష్ట్రం సరన్ జిల్లాలోని రసూల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమన్‌పురా గ్రామానికి చెందిన బలిరామ్ దూబే కుమార్తె పెళ్లి వేడుకలో ఓ దృశ్యం ఆహుతులతో పాటుగా నెటిజన్లను కూడా అలరిస్తోంది.

అక్కడికి అతిధులుగా వచ్చిన కొందరు పోలీసులు వధువరులకు ఇచ్చిన కానుకలు అందర్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేశాయి.విషయం ఏమంటే, పెళ్లి తంతు ముగిసిన తర్వాత పెళ్లి మండపంలోకి వచ్చిన 21మంది పోలీసులు ప్రతి ఒక్కరూ వధూవరులకు హెల్మెట్స్‌ని బహుమతిగా అందజేశారు.

పోలీసు బృందానికి నాయకత్వం వహించిన సందీప్ షాహి అనే హెడ్ కానిస్టేబుల్‌ని ఢిల్లీలో హెల్మెట్‌మ్యాన్ అని పిలుస్తారు.ఢిల్లీలోనే కాదు వేర్వేరు రాష్ట్రాల్లో వాహనదారుల భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపునిస్తూ హెల్మెట్ ప్రాధాన్యతను ప్రచారం చేస్తున్నారు.

ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Telugu Anniversary, Baby, Gifts, Groom, Groom Vikas, Sandeep Shahi, Helmet, Helm

దీనికి ఓ బలమైన కారణం వుంది.కొద్ది రోజుల క్రితం చైన్‌పూర్‌-రసూల్‌పూర్‌ రోడ్డు యాక్సిడెంట్‌లో వధువు బేబీ పెద్దనాన్న మెహగు దూబే మృతి చెందాడు.ఆ సమయంలో పెద్దనాన్నను కోల్పోయిన వధువు బేబీ తమ పెళ్లి వేడుకలకు హెల్మెట్స్‌తో స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నారు.

అందులో భాగంగానే ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సందీప్ షాహి స్ఫూర్తితో తాము ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు నూతన వధువరులు వికాస్, బేబీ.బీహార్‌లో కానిస్టేబుల్‌ కూతురు పెళ్లికి అతిధులుగా వచ్చిన ఢిల్లీ హెడ్‌ కానిస్టేబుల్‌ సందీప్ షాహి బృందం ఇక్కడే కాదు ఎక్కడ తమ శాఖలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ఇళ్లలో శుభకార్యాలు జరుగుతుంటే అక్కడకు వెళ్లి హెల్మెట్స్ బహుమతిగా అందజేయడం విధిగా ఎప్పటినుండో జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube