Meenakshi Seshadri : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. 17 ఏళ్లకే మిస్ ఇండియా?

Guess This Actress In Thi Photo She Is Megastar Chiranjeevis Aapadbandhavudu Movie Fame Heroine Meenakshi Seshadri Childhood Photo

ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సెలబ్రిటీలు కూడా వారి అభిమానులతో వారికి సంబంధించిన ఫోటోలను పంచుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.

 Guess This Actress In Thi Photo She Is Megastar Chiranjeevis Aapadbandhavudu Mo-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా నెట్టింట్లో మరో హీరోయిన్ కి సంబంధించిన ఫోటో తెగ చెక్కర్లు కొడుతోంది.ఆ ఫోటోలో ఒక చిన్నారి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తోంది.

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి తెలుగుతో పాటు హిందీలో టాప్ హీరోయిన్ గా కొనసాగడంతో పాటు 80 – 90ల కాలంలో అందం, అభినయంతో ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది.

అంతేకాకుండా నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ( Bharatanatyam, Kuchipudi, Kathak, Odissi ) నృత్యకారిణి కూడా.అంతేకాదండోయ్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ కేవలం 17 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది.ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )తో కలిసి నటించిన ఒక సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరేట్.

ఈమె మరెవరో కాదు.హీరోయిన్ మీనాక్షి శేషాద్రి.

( Meenakshi Seshadri ) మొదట పెయింటర్ బాబు సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు హిందీ భాషలలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది.

బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్‌తో చేసిన హీరో సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.తెలుగులో 1992లో డైరెక్టర్ కె.

విశ్వనాధ్ తెరకెక్కించిన ఆపద్భాంధవుడు చిత్రంలో నటించింది మీనాక్షి శేషాద్రి.ఇందులో చిరంజీవి, మీనాక్షి, జంధ్యాల ప్రధాన పాత్రలు పోషించారు.

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఆ తర్వాత కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది.పెళ్లి తర్వాత ఫ్యామిలీతో కలిసి అమెరికాలో సెటిల్ అయిపోయింది.

సినిమాలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటుంది మీనాక్షి శేషాద్రి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube