వెన్నెల కిషోర్ ఇప్పుడు పెద్ద స్టార్ .. ఒక్కరోజుకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

పైకి పెద్దగా సౌండ్ చేయకుండా, చాలా ఎక్కువే సంపాదించుకుంటారు కామెడియన్లు.వీళ్ళు హీరోల్లా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేయరు, హీరోయిన్లలా నాలుగైదు సినిమాలతో సరిపెట్టుకోరు.

 Guess How Much Vennela Kishore Is Charging Per Day?-TeluguStop.com

ఏడాది పొడవునా సినిమాలు చేస్తునే ఉంటారు.సినిమాకి ఇంత అని ఉండదు వీరి రెమ్యునరేషన్.

రోజుకి ఇంత అన్నట్లుగా ఉంటుంది.సినిమా సక్సెస్ కాకపోయినా, తాము చేసే కామెడి సక్సెస్ అయితే చాలు.

 Guess How Much Vennela Kishore Is Charging Per Day?-Guess How Much Vennela Kishore Is Charging Per Day-Telugu Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

డిమాండ్ పెరిగిపోద్ది.తక్కువ కష్టంతో ఇక డబ్బులే డబ్బులు.

సీనియర్ కామెడియన్ బ్రహ్మానందం ఊపులో ఉండగా రోజుకి ఎంత తీసుకునేవారో తెలుసా? రోజుకి నాలుగు లక్షలు.ఒక్కోసారి రోజుకి రెండు వేరే యూనిట్లలో షిప్టులు మార్చి రోజుకి పదిలక్షలపైనే వేసుకునేవారు బ్రహ్మానందం.

కాని ఆయన డిమాండ్, రేటు రెండూ పడిపోయాయి.ఈతరంలో స్టార్ కామెడియన్లు ఎవరంటే వెన్నల కిషోర్, పృథ్వీరాజ్.

ఈ మధ్య పృథ్వీరాజ్ ఊపు కూడా తగ్గుతోంది.కాని వెన్నెల కిషోర్ డిమాండ్ కి మాత్రం ఎలాంటి ఢోకా లేదు.కారణం? కిషోర్ చేసేది మాస్ కామెడి కాదు.ఎలాంటి సినిమాలో అయినా ఫిట్ అయిపోతాడు.

క్లాస్ కామెడితో నవ్విస్తాడు.

ఇప్పుడు ఆడుతున్న ఆమీతుమీ సినిమానే తీసుకోండి, శ్రీనివాస్ అవసరాల, అడవి శేష్ లాంటి హీరోలున్నా జనాలు వెన్నెల కిషోర్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం కిషోరే కొట్టేయడంతో అతని డిమాండ్ మరింత పెరిగిపోయింది.ప్రస్తుతం వెన్నెల కిషోరద ఒక్కరోజుకి లక్షన్నర నుంచి రెండున్నర లక్షలు తీసుకుంటున్నాడు.

ఇక నుంచి మూడు నుంచి మూడున్నర లక్షలు తీసుకుంటాడని ఫిలింనగర్ టాక్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube