ఆసక్తి పుట్టిస్తున్న సప్తగిరి గూడుపుఠాణి ట్రైలర్.. చూస్తే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు సప్తగిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన అద్భుతమైన కామెడీ టైమింగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 Guduputani Trailer Released Sapthagiri-TeluguStop.com

ఇదిలా ఉండగా సప్తగిరి హీరోగా ఉన్నటువంటి చిత్రం “గూడుపుఠాణి“. కె.ఎం.కుమార్‌ దర్శకత్వంలో సప్తగిరి,నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.ఆర్‌.

ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీనివాసరెడ్డి, రమేశ్‌ యాదవ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 Guduputani Trailer Released Sapthagiri-ఆసక్తి పుట్టిస్తున్న సప్తగిరి గూడుపుఠాణి ట్రైలర్.. చూస్తే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు.

హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ సన్నివేశాలతో ప్రారంభమైన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.లవ్ స్టోరీతో పాటు యాక్షన్ సన్నివేశాలతో ఉన్నటువంటి ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో సప్తగిరితో పోటీ పడటానికి దర్శకుడు గాయకుడు రఘు కుంచే విలన్ పాత్రలో నటిస్తున్నారు.అసలు వీరిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడటానికి గల కారణం ఏమిటి ఇందులో “గూడుపుఠాణి” ఎవరు చేశారనే ఈ విషయం తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి ఉండాలి.ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Srr #Neha Solanki #Tolllywood #Sapthagiri #Sapthagiri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు