కరోనాతో రాలిపోయిన కార్పొరేటర్ కూతురు.. !

కరోనా వల్ల అందరు ఉన్న అనాధలా జీవించవలసి వస్తుంది.ఒకప్పుడు కులం తక్కువని మనుషులను దూరంగా వెలివేసేవారు.

 Gudi Malkapur Corporator Daughter Dies With Corona-TeluguStop.com

కానీ నేడు కరోనా ఉందని అందర్ని దూరంగా ఉంచుతున్నారు.ఈ కరోనా వల్ల బంధాలు బరువవుతుండగా, అయిన వారు కరోనా కాటుకు బలి అవుతుంటే చూస్తూ కన్నీరు కార్చడం తప్ప దగ్గరగా వెళ్లి మనసులో భారం దిగేలా ఏడవలేని దుస్దితి.

ఉన్నవాడు, లేనివాడు అనే భేదం లేకుండా అందర్ని ఒకేలా చూస్తూ జీవిత సత్యాన్ని నేర్పుతున్న కరోనా వల్ల అయినా మనుషుల్లో మార్పు రావడం లేదు.

 Gudi Malkapur Corporator Daughter Dies With Corona-కరోనాతో రాలిపోయిన కార్పొరేటర్ కూతురు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక కరోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో కళ్లముందు 70ఏంఏం లో చూపిస్తుంది.

ఈ వైరస్ వల్ల ఎండిన ఆకుల్లా రాలిపోతున్న ప్రాణాలు ఎన్నో.తాజాగా హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్ కార్పోరేటర్ దేవర కరుణాకర్ కూతురు భవాణి క‌రోనా బారిన ప‌డి మృతి చెందారు.

ఇక్కడ మరో విషాదం ఏంటంటే.గతనెల 20న ఓ బాబుకు జన్మనిచ్చిన భవాణి కన్నకొడుకు అలనపాలన చూడకుండానే మరణించడం.

అదీగాక భవాణి కి డెలివరీ జరిగిన ఆస్పత్రిలోనే కరోనా వైరస్ సోకిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.మరి ఈ నిర్లక్ష్యం తాలూకు నింద ఎవరు భరిస్తారు.

తల్లి లేని ఆ పసివానికి తల్లిని తేగలరా.ఇదండి కరోనా వల్ల సమాజంలో నెలకొన్న పరిస్దితులు.

అందుకే జీవితం విలువ తెలుసుకుని కరోనాకు చిక్కకుండా బ్రతకడం అలవాటు చేసుకుంటే మరెన్నో సంతోషాలు ముందు ముందు అనుభవించవచ్చూ.లేదంటే ఇలా అర్ధాంతరంగా ముగుస్తుంది జీవితం.

#Gudi Malkapur #Death #Corporator #Corona #Daughter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు