జామాకులు, ఉల్లి క‌లిపి ఇలా చేస్తే..జుట్టు రాల‌నే రాల‌ద‌ట‌!

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రో మంది హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో తెగ స‌త‌మ‌త‌మ‌వుతూ మానసికంగా కృంగిపోతున్నారు.ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, హెయిర్ కేర్ లేక‌పోవ‌డం, వేడి వేడి నీటితో త‌ల స్నానం చేయ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, హార్మోన్ ఛేంజ‌స్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.

 Guava Leaves And Onion Pack Helps To Stop Hair Fall Naturally! Guava Leaves, Oni-TeluguStop.com

దాంతో ఏం చేయాలో తెలియ‌క, ఈ స‌మ‌స్య‌కు ఎలా అడ్డు క‌ట్ట వేయాలో అర్థంగాక‌ వాడే షాంపూల‌ను, నూనెను మారుస్తూ డ‌బ్బును త‌గ‌లేస్తుంటారు.

కానీ, మార్కెట్‌లో ల‌భించే ఖ‌రీదైన షాంపూల్లో, నూనెల్లో ఎప్ప‌టికీ మీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క‌దు.

అందుకే స‌హ‌జ‌సిద్ధంగానే హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌ను అరిక‌ట్టాలి.అందుకు జామ ఆకులు మ‌రియు ఉల్లిపాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

జుట్టుకు బ‌లాన్ని అందించి.రాల‌డాన్ని త‌గ్గించే శ‌క్తి ఈ రెండిటికీ ఉంది.

మ‌రి వీటిని కేశాల‌ను ఎలా చూయాలి.? అన్నది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో కొన్ని జామ ఆకులు, పీల్ తీసిన ఒక ఉల్లి పాయ, కొద్దిగా వాట‌ర్‌ వేసి మెత్త‌గా గ్రౌండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఉల్లి, జామాకు మిశ్ర‌మంలో రెండు స్పూన్ల కొబ్బ‌రి నూనె వేసి బాగా క‌లిపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల మ‌రియు జుట్టు మొద‌ళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకోని న‌ల‌బై నిమిషాల పాటు క్యాప్ పెట్టేసుకోవాలి.

Telugu Guava, Care, Care Tips, Fall, Pack, Latest-Telugu Health - తెలు

అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.వారంలో రెండంటే రెండు సార్లు ఇలా చేస్తే ఖ‌చ్చితంగా జుట్టు రాల‌డం త‌గ్గి పెర‌గ‌డం స్టార్ట్ అవుతుంది.పైగా ఈ న్యాచుర‌ల్ హెయిర్ ఫ్యాక్‌ వ‌ల్ల తెల్ల జుట్టు న‌ల్ల‌గా, షైనీగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube