షన్ను పై గృహలక్ష్మి లాస్య షాకింగ్ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?

తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది ఇందులో ఒకప్పటి హీరోయిన్ కస్తూరి తులసి పాత్రలో నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందింది.ఇక ఈ సీరియల్ లో లేడీ విలన్ పాత్రలో యాంకర్ ప్రశాంతి సందడి చేస్తున్నారు.

 Gruhalakshmi Lasya On Bigg Boss 5telugu Contestants And Shanmukh Jaswant Shanmuk-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంతి బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంపై స్పందించారు.తాజాగా షూటింగ్ గ్యాప్ లో లైవ్ లోకి వచ్చిన ఈమె కాసేపు సరదాగా అభిమానులతో ముచ్చటించారు.

ఈ క్రమంలోనే కొందరు ఈమెను రకరకాల ప్రశ్నలను అడిగారు.

ఈ క్రమంలోనే కొందరు చాలా అందంగా ఉన్నారు అంటూ ఈమెను పొగడగా మరికొందరు ఇంత అందంగా ఉండే మీరు పాజిటివ్ రోల్స్ చేయొచ్చు కదా నెగిటివ్ రోల్స్ ఎందుకు అంటూ ప్రశ్నించారు.

నెగిటివ్ పాత్రలో అయితే మంచి స్కోప్ ఉంటుందంటూ ప్రశాంతి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.ఇలా అభిమానులతో ఎంతో సరదాగా ముచ్చటిస్తున్న ఈమెకు కొందరు నెటిజన్లు బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రశ్నలు అడిగారు.

మీరు బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూస్తారా? ఈ కార్యక్రమంలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? మీరు ఎవరికి మద్దతు తెలుపుతారు అంటూ ప్రశ్నల పై ప్రశ్నలు అడిగారు.

Telugu Lasya-Movie

ఈ ప్రశ్నలకు ప్రశాంతి సమాధానం చెబుతూ తాను బిగ్ బాస్ చూస్తానని అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ కూడా తనకు తెలుసని ఆమె తెలిపారు.అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే ఎక్కువ ఫర్ ఫామ్ చేస్తున్నారో వారికే ఓట్లు వేసి గెలిపించండి అని ఈమె ప్రేక్షకులను కోరారు.

Telugu Lasya-Movie

మాకు బయట ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా అని బిగ్ బాస్ హౌస్ లో ఫర్ ఫామ్ చేయకుండా ఉన్నవారికి ఓట్లు వేయకండి అంటూ పరోక్షంగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పై ఈమె కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.యూట్యూబ్ ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న షణ్ముఖ్ ఇంట్లో పెద్దగా టాస్క్ లో పాల్గొన్న లేకపోయినా అతని నామినేట్ చేయడానికి కంటెస్టెంట్ లు భయపడుతున్నారని, అతనికి బయట ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడ వారికి ఓట్లు తగ్గిపోతాయి అంటూ షన్నును నామినేట్ చేయడానికి కంటెస్టెంట్ లో భయపడుతున్నట్లు వినిపించినప్పటికీ ప్రశాంతి షణ్ముఖ్ గురించి చేసిన కామెంట్లు మాత్రం అందరిని ఆలోచనలోకి పడేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube