చిన్నారి ప్రాణాలను కాపాడిన పెంపుడు కుక్క...వైరల్ అవుతున్న వీడియో  

Growing Video Of Dog Saving Girl From Falling Into Deep Water-falling Into Deep Water,social Media,viral Video,గౌన్ ను నోటితో పట్టి వెనకకు లాక్కొచ్చి కిందకు నెట్టింది,సోషల్‌ మీడియా

పెంపుడు జంతువులకు విశ్వాసం ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. అందులో విశ్వాసానికి పెట్టింది పేరు పెంపుడు కుక్క. కుక్కను పెంచుకున్నట్లు అయితే నిజంగా ఆ కుక్క యజమాని,వారి కుటుంబం మీద చూపే విశ్వాసం అంతా ఇంతాకాదు..

చిన్నారి ప్రాణాలను కాపాడిన పెంపుడు కుక్క...వైరల్ అవుతున్న వీడియో -Growing Video Of Dog Saving Girl From Falling Into Deep Water

ఇప్పుడు అలాంటి ఒక సంఘటనకు సంబందించిన వీడియో నే ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నదిలోకి వెళుతున్న ఓ చిన్నారి ప్రాణాలను వారి పెంపుడు కుక్క కాపాడింది. నదీ తీరంలో అడుకుంటున్న చిన్నారి, గబుక్కున తన చేతిలోని బాల్ నీళ్లలో పడేసుకుంది.

అయితే నది లో పడిపోయిన బంతిని తీసుకునేందుకు ఆ చిన్నారి ప్రయత్నించడం కోసం వడి వడి అడుగులు వేసుకుంటూ నదిలోకి వెళ్లే ప్రయత్నం చేసింది.

దీనితో అక్కడే ఉన్న కుక్క వెంటనే ఆ చిన్నారి గౌన్ ను నోటితో పట్టి వెనకకు లాక్కొచ్చి కిందకు నెట్టింది. అనంతరం ఆ కుక్కే నీళ్లలో కి దిగి మళ్లీ బంతిని తీసుకువచ్చింది.

దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో చిన్నారి ప్రాణాలు కాపాడిన ఆ కుక్కను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిజంగా టైం కు ఆ కుక్క గనుక ఆ చిన్నారిని వెనకకు లాగకపోయి ఉండి ఉంటె మాత్రం ఆ చిన్నారి నీళ్ల ల్లో మునిగిపోయే ఛాన్స్ ఉండేది. కానీ పెంచిన విశ్వాసం తో ఆ చిన్నారి ప్రాణాలను కుక్క కాపాడడం తో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.