బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు.. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు

ఏదేమైనా కూడా తెలంగాణ‌లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్ర‌జా సంగ్రామ‌యాత్ర‌కు మంచి స‌పోర్టు వ‌స్తోంది.దీనికి కేంద్ర నాయ‌క‌త్వం ఫుల్ స‌పోర్టు ఇవ్వ‌డంతో ఇత‌ర రాష్ట్రాల‌కు ఎందిన‌టువంటి బీజేపీ నేత‌లు కూడా కనిపిస్తున్నారు.

 Growing Support For Bandi Sanjay Padayatra Criticisms On Kcr-TeluguStop.com

ఇక వారు వ‌స్తూనే బండి సంజయ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఇదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్ పై విమర్శ‌లు ఎక్కుపెట్ట‌డంతో ఇప్పుడు జాతీయ మీడియా కూడా దీన్ని బాగా హైలెట్ చేస్తోంది.

కేవ‌లం దీన్ని తెలంగాణ వ‌ర‌కే ప‌రిమితం కాకుండా ఇప్పుడు దీనికి జాతీయంగా క్రేజ్ తీసుకువ‌స్తున్నారు.

 Growing Support For Bandi Sanjay Padayatra Criticisms On Kcr-బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు.. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు తెలంగాణ‌లో కేసీఆర్ ది కుటుంబ పాలన అంటూ ప్ర‌తి ఒక్క‌రూ కూడా విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

కేసీఆర్‌ది నిజాం పాలన ఆయ‌న్ను రాబోయే ఎన్నిక‌ల్లో ఓడిస్తామంటూ చెప్ప‌డంతో కేసీఆర్ కు ఇది పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.ఎందుకంటే ఇత‌ర రాష్ట్రాల్లోని బీజేపీ నేత‌లు, మాజీ ముఖ్‌యంమంత్రులు కూడా హ‌జ‌ర‌వుతున్నారు.

ఇక మొన్న మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ వ‌స్తే ఇక‌క నిన్న చత్తీస్ ఘ‌డ్ మాజీ సీఎం రమణ్ సింగ్, అలాగే కర్ణాటకకు చెందిన ఎంపీ శోభాకరంద్లాజే వ‌చ్చి మ‌ద్ద‌తు ప‌లికారు.ఇక రమణ్ సింగ్ అయితే కేసీఆర్ పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

ఇక తెలంగాణను త్వ‌ర‌లోనే గ‌డీల పాలన నుంచి విడిపిస్తామ‌ని, తాము అధికారంలోకి రాగానే టీఆర్ ఎస్‌, కేసీఆర్ అవినీతిపై కేసులు పెడ‌తామంటూ చెప్ప‌డం సంచ‌ల‌నం రేపుతోంది.ఇక్క‌డ విశేషం ఏంటంటే ఇత‌ర రాష్ట్రాల్లో ఓడిపోయిన వారు ఇప్పుడు తెలంగాణ‌కు వ‌చ్చి ఇలా మాట్లాడ‌టం విడ్డూరం.అది కూడా వారేదో ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కులుగా వ‌చ్చి కేసీఆర్‌పై నిప్పులు చెర‌గ‌డం ఇక్క‌డ కొంత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.ఏదేమైనా కూడా బండింస‌జ‌య్‌కు ఇలా అన్ని రాష్ట్రాల నుంచి మ‌ద్ద‌తు రావ‌డంతో ఆయ‌న ఇమేజ్ అమాంతం పెరిగిపోతోంది.

#Bandi Sanjay #Congress #Etala #Trs #RamanSingh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు