పాకిస్తాన్‌లో పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం.. ప్రజల్లో ఆందోళన

దాయాది పాకిస్తాన్( Pakistan ) తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ ఆర్ధిక సంక్షోభం మరింత తీవ్రతరం అవుతోంది.

 Growing Economic Crisis In Pakistan People Are Worried, Growing Economic Crisis,-TeluguStop.com

దీంతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంతగా పెరిగిపోతుండటంతో ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది.ఏ వస్తువు కొనాలన్నా, నిత్యాసర సరుకులు కొనాలన్నా భారీగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి.

దీంతో పేదలు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీంతో ఆకలి బాధలు కూడా పాకిస్తాన్‌లో పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.

మొన్న శ్రీలంకలో ఏర్పడిన పరిస్థితులే, ఇప్పుడు పాకిస్తాన్‌లో ఏర్పడుతున్నాయి.దివాలా పరిస్థితులు పాకిస్తాన్‌ను కష్టాల్లోకి నెట్టేశాయి.

Telugu Economic, International, Latest, Pakistan, Concerns-Telugu NRI

ఈ ఆర్ధిక సంక్షోభంపై పాకిస్తాన్ ఆర్ధికశాఖ మంత్రి ఇషాక్ దార్( Finance Minister Ishaq Dar ) తాజాగా స్పందించారు.పాకిస్తాన్ ఈ ఆర్ధిక పరిస్థితి గురించి ఎప్పుడు బయటపడుతుందనే దానిపై క్లారిటీ ఇచ్చారు.త్వరలోనే పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆర్ధిక సమస్య నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.తాజాగా కరాచీలో ( Karachi )జరిగిన వాణిజ్య మండలి పరిశ్రమ సమావేశంలో ఆర్ధికశాఖ మంత్రి పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభం గురించి వివరించారు.

Telugu Economic, International, Latest, Pakistan, Concerns-Telugu NRI

పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణ, విధానాల గురించి వివరించారు.పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గతంలోనూ సంక్షోభాన్ని ఎదుర్కొందని, అప్పుడు కూడా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుని బయటపడ్డామని చెప్పారు.198,2013లో కూడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఆ తర్వాత పుంజుకున్నట్లు గుర్తు చేశారు.ఇప్పుడు కూడా సమస్య నుంచి బయటపడి సాధారణ పరిస్థితికి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.2017కు పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ కాస్త కుదుటపడిందని, ఇప్పుడు మళ్లీ పతనావస్థకు చేరిందని ఆర్థికశాఖ మంత్రి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube