షర్మిలతో జగన్ కు ఇబ్బందులే ? ఆర్కే ఇంటర్వ్యు తో మరింతగా ..?

ప్రస్తుతం వైఎస్సార్ కుటుంబం లోని వ్యక్తులు వేరు వేరు రూట్ల లో ప్రయాణిస్తున్నారు.ఏపీ లో జగన్ అధికారంలో ఉన్నారు.

 Growing Differences Between Sharmila Jagan Abn Rk, Jagan, Chandrababu, Ap,ys Vij-TeluguStop.com

ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ దీక్షలతో పాటు,  ఓదార్పు యాత్రలు నిర్వహిస్తూ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి జగన్ కు ఆమెకు మధ్య పెరిగిన విభేదాలు కారణం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ.

ఆ విభేదాలు తీవ్ర స్థాయికి చేరడం తోనే, షర్మిల కొత్త పార్టీ వైపు అడుగులు వేశారు అని , అసలు వైసిపి ఏపీలో అధికారంలోకి రాగానే ఆమె కీలక పదవి దక్కుతుందని, వైసీపీలో ఆమెకు నెంబర్ 2 స్థానంలో ఉంటారని అంతా అభిప్రాయపడ్డారు.
      జగన్ మాత్రం దూరం పెడుతూనే వచ్చారు.

అంతేకాకుండా ఆమె చేసిన సిఫార్సులను పట్టించుకోకుండా వ్యవహరించడం తదితర కారణాలతో ఆమె పూర్తిగా జగన్ కు దూరమయ్యారని, ఆ విభేదాలు పెరగడంతో నే అన్న మీద కోపం తో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారని ప్రచారం వైఎస్ కుటుంబ సన్నిహితుల నుంచి మొదలైంది.ఇక జగన్ షర్మిల కు విబేధాల నేపథ్యంలో తల్లి విజయమ్మ  షర్మిలకు అండగా నిలబడడం ఆమె పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు షర్మిల.
   

Telugu Abn Rk, Chandrababu, Jagan, Ys Vijayamma, Ysrtp-Telugu Political News

  ప్రయత్నాలు చేస్తూ ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉండడం వంటి వ్యవహారాలు జగన్ కు, విజయమ్మకు మధ్య దూరం పెరిగిందనే ప్రచారానికి మరింత ఊతం ఇస్తున్నాయి.  మొత్తంగా వైయస్ ఫ్యామిలీ లో సఖ్యత లేదనే విషయం బహిర్గతం అయింది.ఈ దూరం ఇలా ఉండగానే జగన్ ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ,  వ్యతిరేక కథనాలతో విరుచుకుపడుతూ ఉండే ఏబీఎన్ ఛానెల్ కు ఆమె వెళ్ళడం , అక్కడ ఆమె  కుటుంబానికి సంబంధించిన విషయాలపై మాట్లాడడం, వంటివి మరింత సంచలనంగా మారాయి.  జగన్ ను ఇరుకున పెట్టేవిధంగా ఏబీఎన్ ఆర్ కె ఇంటర్వ్యూ లో ప్రశ్నలు అడగడం వాటికి సమాధానాలు చెప్పడం,  ఇతర వ్యవహారాలన్నీ అన్నాచెల్లెళ్ల మధ్య మరింతగా దూరం పెంచుతూనే వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube