విజయవాడలో వెలుగు చూసిన ఘోరం..మత్తిచ్చి       2018-07-05   04:02:10  IST  Raghu V

ఏపీ రాజధాని నడిబొడ్డున ఘోరం జరిగింది..ప్రతీ రోజు యువతులు మోసపోయిన..అత్యాచారాలకి గురయిన సంఘటనలు మనం వింటూనే ఉన్నాం అయినా సరే యువతులు తమ జాగ్రత్తలో ఉండకపోవడం వారి జీవితాలని బలి చేస్తోంది..రెండు రోజుల క్రితం గుంటూరులో విద్యార్ధినిపై జరిగిన దాడి కేసు మరువక ముందే మరొక విద్యార్ధినిపై జరిగిన సామూహిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది..వివరాలలోకి వెళ్తే..

తెదేపా ఆధ్వర్యంలో విజయవాడలో పాయకాపురంలో బుధవారం జరుగుతున్న పాదయాత్రకి బందోబస్తుగా వెళ్లిన పోలీసులు.. నలుగురు యువకులతో కలిసి యువతి (19) ఉడాకాలనీ కరకట్ట ప్రాంతంవైపు వెళ్తున్నట్లు గమనించి వారిని విచారించారు…అయితే ఆ యువతి మత్తుగా సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని తమ రీతిలో విచారించే సరికి నిజం బయట పెట్టేశారు.

గుణదల ప్రాంతానికి చెందిన యువతి పాలిటెక్నిక్ చదివింది… ఆమెతో పరిచయం ఉన్న ఓ విద్యార్థి మరో ముగ్గురు చదువు మానేసిన యువకులతో కలిసి యువతిని బుధవారం సాయంత్రం ఉడాకాలనీ కరకట్ట ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ యువతికి మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు…ఆ యువకులని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.