బాబు మెప్పు కోసమే : బుద్దా వెంకన్న వర్సెస్  కేశినేని నాని ? 

బెజవాడ రాజకీయాలు ఎప్పుడు చిత్ర విచిత్రంగా ఉంటాయి.అంతే కాదు ఎప్పుడూ సంచలనాలు రేపుతూ ఉంటాయి.

 Group Politics Still Going On In Vijayawada Tdp Kesineni Nani, Chandrababu, Jaga-TeluguStop.com

 ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీనే తీసుకుంటే ఇక్కడ టీడీపీ లో ఏకాభిప్రాయం లేదు.పార్టీ రెండు వర్గాలుగా ఎప్పటి నుంచో ఉంది.

ఒక వర్గం పై మరో వర్గం పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రభావం విజయవాడలో ఎక్కువగా ఉండటం, ఆయన ప్రతి దశలోనూ పార్టీలో పట్టు సాధిస్తే ఉండడం, తన వర్గానికి ప్రాధాన్యం దక్కేలా చేసుకుంటూ ఉండటం,  టీడీపీ లో మరో వర్గంగా ఉన్న బోండా ఉమ, బుద్దా వెంకన్న వంటి వారికి ఏమాత్రం  రుచించడం లేదు.

కేశినేని నాని ప్రభావాన్ని తగ్గించేందుకు బొండా ఉమా,  బుద్ధ వెంకన్న వంటివారు ప్రతి దశలోనూ ప్రయత్నాలు చేస్తూ ఉండే వారు.

ఒక దశలో వీరి మధ్య ఆధిపత్య పోరు మీడియాకు ఎక్కడం తో పాటు,  నేరుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకునే వరకు వెళ్ళింది.

చివరకు అధినేత చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టారు.ఇక అప్పటి నుంచి ఎడమొహం పెడమొహంగానే ఈ రెండు వర్గాలు ఉంటూ వస్తున్నాయి.

ఒకరి విషయంలో మరొకరు కలగజేసుకోవడం మానేశారు.ఒకరి వ్యవహారంలోకి మరొకరు వెళ్లడం లేదు.

ఒకరికి ఒకరు కు సంబంధం లేదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.ఇటీవల కేశినేని నాని కి చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

విజయవాడ నగర కమిటీ లోను నాని వర్గీయులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.దీంతో వెంకన్న వర్గం పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

కేశినేని నాని వ్యవహారంలో తాము ఏమి పట్టించుకోమని, ఆయనకు తాము సహకరించేది లేదంటూ తేల్చేశారు.ఇటీవల వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ జరిగింది అనే వ్యవహారం తెర పైకి రాగానే కేశినేని నాని రాధను పరామర్శించారు.దీంతో బుద్ధ వెంకన్న వర్గం ఈ వ్యవహారంలో దూరంగా ఉంది.తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని కేసినో వ్యవహారంలో బుద్ధ వెంకన్న వర్గం హైలెట్ అయ్యింది.

కానీ ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదన్నట్లుగా కేసినేని నాని సైలెంట్ అయిపోయారు.ఒకరు కలగజేసుకునే వ్యవహారంలోకి మరొకరు ఏమాత్రం వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.ఎవరికివారు సొంతంగా అధినేత ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప , ఉమ్మడిగా పార్టీ వ్యవహారాల్లో కలిసి ముందుకు వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube