టీ బీజేపీలో కాంగ్రెస్‌ తరహా సీన్స్‌.. ఇలా అయితే కష్టం

కాంగ్రెస్ పార్టీ( Congree party ) అంటేనే కుమ్ములాటల పార్టీ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Group Politics In Telangana Bjp Leaders ,bjp Leaders, Ts Bjp , Congress , Komati-TeluguStop.com

వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అంతర్గత కుమ్ము లాటలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.నూటికి నూరు శాతం వారి అంతర్గత కుమ్ములాటల కారణంగానే రాష్ట్రంలో పార్టీ కి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని.

కింది స్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నా కూడా అధికారాన్ని దక్కించుకోక పోవడంతో పాటు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణం అంతర్గత కుమ్ములాటలే అంటూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో పోలిస్తే బిజెపి లో అలాంటి వ్యవహారాలు చాలా తక్కువగానే ఉంటాయి అనేది ఇంతకు ముందు ఉన్న మాట.

ఇప్పుడు తెలంగాణ బిజెపి నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను చూసి నేర్చుకుంటున్నారో ఏమో కానీ పదే పదే తెలంగాణ బిజెపి లో అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయి.ఇటీవల ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతుంది./br>

ఈటెల రాజేందర్( Etela Rajender ) విషయం లో జరుగుతున్న హడావుడి చూస్తూ ఉంటే రాష్ట్ర బీజేపీ లో ఏ స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.ఈ స్థాయిలో అంతర్గత కుమ్ములాటలుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపొందడం ఎంత వరకు సాధ్యం అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ పద్ధతిని పాటించకుండా అధిష్టానం సూచించిన దారిలో బిజెపి ముఖ్య నాయకులంతా కూడా వెళ్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.లేదంటే మునుపటి ఫలితాలే పునరావృతమైన ఆశ్చర్యం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube