నాదెండ్ల ముందే రచ్చ రచ్చ ! జనసేన లో గ్రూప్ పాలిటిక్స్ ?

Group Politics Have Grown Significantly In The Janasena Party

జనసేన పార్టీ రాజకీయంగా యాక్టీవ్ అయ్యింది.ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని,  పార్టీ ని పరుగులు పెట్టించే పనికి శ్రీకారం చుట్టారు .

 Group Politics Have Grown Significantly In The Janasena Party-TeluguStop.com

వరుసగా అనేక ప్రజా సమస్యలపై గళం ఎత్తుతూ,  జనాల్లో జనసేన పై చర్చ జరిగేలా చేస్తున్నారు.ప్రస్తుతం వైసీపీ పై పెరుగుతున్న వ్యతిరేకత , పడిపోతున్న టీడీపీ  గ్రాఫ్ ఇవన్నీ జనసేనకు బాగా కలిసొస్తుందని,  ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ప్రభావం బాగానే కనిపించింది ఆ పార్టీ  ఖుషీగా ఉన్నారు.

  ఈ పరిణామాలన్నింటినీ ఉపయోగించుకుని రాజకీయంగా చక్రం తిప్పేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది.  ఈ మేరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ జనాల్లో చర్చ జరిగేలా చేస్తున్నారు.

 Group Politics Have Grown Significantly In The Janasena Party-నాదెండ్ల ముందే రచ్చ రచ్చ జనసేన లో గ్రూప్ పాలిటిక్స్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా అమలాపురం నియోజకవర్గ సమావేశంలో సాక్షాత్తు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలోనే పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి.నాదెండ్ల మనోహర్ పాల్గొన్న ఈ సమావేశం ఇందుపల్లి ఏ కన్వెన్షన్ హాల్ లో  ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టి బత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు ఈ సమావేశం ముగిసిన అనంతరం మనోహర్  బయటకు వెళుతున్న సమయంలో హాలు బయట ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.ముఖ్యంగా సమపన , ఈదరపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఇది మరింత తీవ్రతరమై రెండు వర్గాలు బాహాబాహీకి దిగడం,  కేకలు అరుపులతో ఆ ప్రాంతం లో ఉద్రిక్తత  చోటుచేసుకుంది.

Telugu Amalapuram, Ap, Janasena, Janasenaeffairs, Pavan Kalyan, Rajababu, Sathish, Ysrcp-Telugu Political News

రాజబాబుకు నియోజకవర్గం లోని కొంతమంది పార్టీ నాయకులకు మధ్య ఇటీవల కొంత విభేదాలు వచ్చాయి .దీంతో రెండు వర్గాలుగా పార్టీ చీలింది.మాజీ మున్సిపల్ చైర్మన్ టిడిపి నాయకులు సతీష్ ఆ పార్టీ కి రాజీనామా చేసి జనసేన చేరేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయనను రాజబాబు వర్గం అడ్డుకుంటూ వస్తున్నట్లు సతీష్ వర్గం ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు మధ్య నాదెండ్ల మనోహర్ సమక్షంలోనే  విభేదాలు బయటపడడం పార్టీలో కలవరం పుట్టించింది.

#JanasenaEffairs #Amalapuram #Janasena #Ysrcp #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube