రేవంత్ యాత్రలో టికెట్ల వివాదం ! అలిగిన ఓ వర్గం

తెలంగాణ కాంగ్రెస్ లో( Telangana congress ) గ్రూపు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి.ప్రస్తుతం హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి( Revanth reddy ) యాత్రలోనే ఈ విబేధాలు బయటపడడం సంచలనం రేపుతోంది.

 Group Politics Among Congress Leaders During Revanth Reddy Padayatra Details, Te-TeluguStop.com

సహజంగానే తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు సర్వసాధారణం ఎప్పుడు ఏదో ఒక వివాదం సీనియర్ నాయకులు మధ్య తలెత్తుతూనే ఉంటుంది.ఎప్పటికప్పుడు అధిష్టానం పెద్దలు ఈ గ్రూపు రాజకీయాలపై ఫోకస్ పెట్టినా, నాయకుల మధ్య సయోధ్య కుదిర్చినా, ఇవన్నీ సర్వసాధారణంగానే మారిపోయాయి.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో హాథ్ సే హాథ్ జొడో పాదయాత్రలో వుండగానే రెండు గ్రూపుల మధ్య వివాదాలు తెరపైకి రావడం, అందులో ఒక వర్గం అలిగి రేవంత్ పాదయాత్రకు దూరంగా ఉండడం కలకలం రేపుతోంది.గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ దీక్ష సందర్భంగా రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసి బాధ్యతపై మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.

Telugu Aicc, Congressasembly, Congress, Jujula Surender, Madan Mohan Rao, Pcc, R

రేవంత్ రెడ్డి సభ ప్రారంభానికి ముందుగానే సభ స్థలి వద్ద ఎల్లారెడ్డి స్థానాన్ని ఆశిస్తున్న సుభాష్ రెడ్డి మదన్మోహన్ వర్గీయులు వివాదానికి దిగారు.సరిగ్గా అదే సమయంలో రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సుభాష్ రెడ్డి స్థానంలో జుజుల సురేందర్ కు( Jujula surender ) టికెట్ కేటాయించిన విధానంపై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి.దీంతో ఈరోజు చేపట్టిన రేవంత్ పాదయాత్రకు మదన్మోహన్ వర్గం దూరంగా ఉంది.రేవంత్ రెడ్డి పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే మదన్మోహన్ కామారెడ్డిలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ ఆలీని ఉద్దేశించి చేసిన విమర్శలు కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలను బహిర్గతం చేశాయి.

Telugu Aicc, Congressasembly, Congress, Jujula Surender, Madan Mohan Rao, Pcc, R

కామారెడ్డి జిల్లాలో షబ్బీర్ అలీ వర్గం, టి.పిసిసి ఐటి సెల్ చైర్మన్ , పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల మదన్మోహన్ రావులు మరో వర్గం గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి.జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన మదన్ మోహన్ రావు ఓటమి చెందినప్పటి నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కానీ అక్కడ పార్టీ ఇన్చార్జిగా ఉన్న సుభాష్ రెడ్డి తనకు టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు.మదన్మోహన్రావుకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ ఉండగా.సుభాష్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్గీయుడిగా షబ్బీర్ అలీ మద్దతు ఉంది.గడిచిన ఏడాది ఎల్లారెడ్డిలో రేవంత్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా బహిరంగ సభ సాక్షిగా నే విభేదాలు తలెత్తాయి.

ఇప్పుడు మరోసారి తలెత్తిన వివాదం మరింత అగ్గి రాజేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube