పెళ్లికి వారం ముందు అదనపు కట్నం అడిగిన పెళ్లి కొడుకు... పెళ్లి కూతురు కుటుంబం చేసిన పనికి శభాష్ అంటారు....  

Groom\'s Head Partially Shaved In Lucknow After He Demands Dowry -

కట్నం మన దేశం లో పెళ్లి జరిగే సమయం లో పెళ్లి కూతురి ఇంటి వాళ్ళు పెళ్లి కుమారుడికి ఇచ్చే కనుక.కట్న కానుకలు అనేవి కూతురి మీద ప్రేమతో వారి ఇష్టపూర్వకంగా ఇస్తే బాగుంటుంది.

Groom's Head Partially Shaved In Lucknow After He Demands Dowry

కానీ వరకట్నాల కోసం భార్యలను వేధించడం , చిత్ర హింస కి గురి చేసి వారికి మానసిక క్షోభ కి గురి చేయడం వంటివి చట్ట రీత్యా నేరంగా పరిగణిస్తారు.వరకట్న వేధింపులతో అత్తవారి కుటుంబం చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వివాహితలు ఎంతో మంది.

ఎన్ని చట్టాలు వస్తున్న ఎన్ని చర్యలు తీసుకున్నా వరకట్న నిషేధాలు , వరకట్న వేధింపులు మాత్రం ఆగడం లేదు.పెళ్లి కి కొన్ని రోజుల ముందు అదనపు కట్నం గా బంగారం తో పాటు బైక్ ను అడిగిన పెళ్లి కొడుకు కుటుంబానికి చేదు అనుభవం మిగిలింది.

పెళ్లికి వారం ముందు అదనపు కట్నం అడిగిన పెళ్లి కొడుకు… పెళ్లి కూతురు కుటుంబం చేసిన పనికి శభాష్ అంటారు….-General-Telugu-Telugu Tollywood Photo Image

అసలు విషయానికొస్తే…

లక్నో లోని ఒక గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడి తో పెళ్లి కుదిరింది.పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారికి వధువు కుటుంబీకులు కొంత మొత్తాన్ని కట్నంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు.

అయితే పెళ్లి రోజులు దగ్గర పడే కొద్దీ మగ పెళ్లి వారి కట్నం కోరికలు ఎక్కువైపోయాయి .పెళ్లి కుమారుడికి కట్నం తో పాటు బండి మరియు బంగారాన్ని కూడా పెట్టాల్సిందే అని , ఒకవేళ అవి పెట్టకపోతే పెళ్లి చేసుకునేది లేనే లేదని తేల్చిచెప్పేశాడు.

పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు చేసిన పని

పెళ్లికి మరో ఐదో రోజులు మాత్రమే మిగిలి ఉండడం తో పెళ్లి కుమారుడి తరుపున వారికి సద్ది చెప్పడానికి ప్రయత్నించగా వారు వెనకకు తగ్గలేదు.దీనితో వధువు కుటుంబ సభ్యులందరు కలిసి పెళ్లి కుమారుడికి కావాల్సినవన్నీ పెట్టడానికి తాము సిద్ధమే అని వరుడిని అతని కుటుంబ పెద్దలని కళ్యాణ మంటపం దగ్గరికి రావాలని కోరారు.దీనితో వరుడు అతని బంధువులు కలిసి మంటపం దగ్గరికి వెళ్తే వారికి ఘోరమైన అవమానం జరిగింది.పెళ్లి కుమారుడికీ, అతని అన్న, తండ్రికి అరగుండు గీసి పంపించారు.

పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబై మండపానికి వచ్చిన వరుడికి ఈ విధంగా సన్మానం చేసి పంపించారు.ప్రస్తుతం సోషల్ మీడియా లో వరుడు అరగుండు తో ఉన్న ఫోటో వైరల్ అవుతుంది.

దీని పైన సోషల్ మీడియా లో నెటిజన్లు వివిధ రకాల జోక్ లతో పాటు కామెంట్ లు చేస్తున్నారు.కట్నం అడిగినందుకు బాగా బుద్ధి చెప్పారని వధువు కుటుంబ సభ్యులను ప్రశంసించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Groom\'s Head Partially Shaved In Lucknow After He Demands Dowry- Related....