వీడియో వైరల్: వధువును చితక్కొట్టిన వరుడి తమ్ముడు.. ఎందుకంటే?

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో వైలెన్స్ ఎక్కువ అయిపోతుంది.ఎంతో ప్రశాంతగా, అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లలో గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి.

మొన్నటికి మొన్న పెళ్లి జరిగిన రోజే ఓ యువకుడు భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు.

మరో ఘటనలో పెళ్లి అనంతరం కేక్ కట్ చేసిన తర్వాత భర్తకు క్యూట్ గా కేక్ పెట్టాలి అని ఆ కొత్త పెళ్లికూతురు ట్రై చేస్తే అతి చేసిందని ఆ భర్త అక్కడే ఆమెను దారుణంగా కొట్టాడు.

సరే ఈ ఘటనల్లో అన్న పెళ్లి కూతురుని పెళ్లి కొడుకు కొట్టాడు.కానీ ఇక్కడ పెళ్లి కూతురును పెళ్లి కొడుకు తమ్ముడు అతి దారుణంగా కొట్టాడు.

అదే ఏం అంటే సంప్రదాయం అంటున్నారు.ఇంకా ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది బయటకు రాలేదు కానీ దానికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక పెళ్లిలో శాంతి గేమ్ అనే సంప్రదాయం ఉంటుంది.ఇంకా ఈ ఆటలో వధువుకు, వరుడి తమ్ముడు మధ్య పోటీ పెడతారు.

నెమలి పించాలతో ఇద్దరు కొట్టుకోవాలి.ఈ ఆట అక్కడ సంప్రదాయం.

కానీ, ఆ వరుడు తమ్ముడు వధువు మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అకస్మాత్తుగా వధువును నెమలి పించంతో చితకబాదడం మొదలుపెట్టాడు.

దీంతో అక్కడున్న పెద్దలు అతడిని కూల్ చెయ్యగా కొందరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్25, గురువారం 2024