మనసుని కదిలిస్తున్న వీడియో..తాళి కట్టేటప్పుడు ఏడ్చిన వధువు !

మన దేశంలో పెళ్లిని ఎంత పవిత్రంగా భావిస్తారో అందరికి తెలిసిన విషయమే.మన సంస్కృతులు, ఆచార సాంప్రదాయాలు విదేశీయులు కూడా ఇష్ట పడతారుపెళ్లి అంటేనే చెప్పలేని అనుభూతి పెళ్లి అనేది ఇద్దరి మనుషులను మాత్రమే కాదు రెండు కుటుంబాలను కూడా ఒకటిగా కలుపుతుంది.

 Groom Wears Mangalsutra, Bride Cries Bitterly, Viral Wedding Video, Bride Crying-TeluguStop.com

ఈ మధ్య పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

పెళ్ళిలో జరిగే చిన్న చిన్న విషయాలు వీడియోల రూపంలో బయటకు రావడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

అందులో కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటే మరికొన్ని వీడియోలు మాత్రం మనసుకు హత్తుకునేలా ఆనంద భాష్పాలు తెప్పించే విధంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.అలంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

పెళ్లి అనగానే అమ్మాయిలు ఒక రకంగా సంతోషంగా ఉన్న మరొక విధంగా ఆలోచిస్తే పుట్టింటిని వదిలి పెట్టి వెళ్లాలని భాదపడుతూ ఉంటారు.పెళ్లి తర్వాత అప్పగింతల్లో కన్నీటి పర్యంతం అవుతారు.తాజాగా ఒక వధువు అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉంది వరుడు వధువు మెడలో తాళి కడుతుంటే ఆమె బోరున ఏడవడంతో అందరు ఆశ్చర్య పోయారు.

ఒక వైపు సంతోషంగా ఉన్న తన కుటుంబాన్ని వదిలి వెళ్లి పోవాలనే బాధతో అప్పటి వరకు సంతోషంగా ఎంజాయ్ చేసిన వధువు వరుడు తాళి కట్టేటప్పుడు మాత్రం కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది.ఒక వైపు సంతోషం మరొక వైపు భాధ ఇలా రెండు భావాలను ఆమె కంట్రోల్ చేసుకోలేక ఎమోషనల్ అయ్యింది.ఆ తర్వాత వరుడు ఓదార్చడంతో ఆమె వెంటనే నవ్వింది.

ఈ వీడియో చూసినంత సేపు వధువు ఏ భావాలూ పలికిస్తుందో చూసేవారు కూడా అలానే చేయడం పక్కా.ఈ వీడియో చూసి నెటిజెన్స్ కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

అమ్మాయిలు అయితే ఇది అందరి లైఫ్ లో వచ్చే తీయని బాధ అంటూ గుర్తు చేసుకుంటున్నారు.మీరు కూడా ఈ వీడియోను చూసి మీ అనుభవాలను పంచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube