పెళ్లి కొడుకు వింత ప్రవర్తన... మండపంలో షాక్ ఇచ్చిన పెళ్లి కూతురు  

Groom Kicked Out Of His Own Wedding After He Abuses-he Abuses,own Wedding,uttarpradesh

హిందూ సంప్రదాయంగా జరిగే పెళ్లి వేడుకలలో ఒక్కో చోట ఒక్కో సంప్రదాయం ఉంటుంది.ఈ ప్రాంతాన్ని బట్టి పెళ్లి తంతులో కొన్ని సరదా ఆటలు కూడా ఉంటాయి.

Groom Kicked Out Of His Own Wedding After He Abuses-he Abuses,own Wedding,uttarpradesh Telugu Viral News Groom Kicked Out Of His Own Wedding After He Abuses-he Abuses Own Uttarpradesh-Groom Kicked Out Of His Own Wedding After He Abuses-He Abuses Own Uttarpradesh

పెళ్లి కొడుకుకి వరసయ్యే వారు అతనిని ఆటపట్టించడం చేస్తూ ఉంటారు.అయితే ఇలాంటి సరదా ఆటలని అంతే సరదాగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.

అయితే ఉండదు.కానీ అలాంటి సరదా సాంప్రదాయాలను సీరియస్గా తీసుకుంటే ఆ పెళ్లి పెటాకులైందా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.అత్తింటివారు చేసే సరదా అల్లరిని సీరియస్ గా తీసుకున్న పెళ్లి కొడుక్కి పెళ్లికూతురు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వివేక్‌ కుమార్‌ అనే వ్యక్తి వివాహం పట్టణానికి చెందిన ఓ యువతితో జరగాల్సి ఉంది.అయితే పెళ్లి మండపంలోకి తోడ్కొని వెళ్లే క్రమంలో పెళ్లి కూతురు కుటుంబంలో ఉన్న ఆచారం ప్రకారం వరుడికి మరదలు వరసయ్యే యువతి వివేక్‌ చెప్పులు దాచిపెట్టింది.

డబ్బులు ఇస్తేనే వాటిని తిరిగి ఇస్తానని ఆటపట్టించింది.అయితే దీనిపై ఆగ్రహంతో ఊగిపోయిన వివేక్‌ ఆమెపై నోరుపారేసుకున్నాడు.

ఇష్టానుసారంగా దుర్భాషలాడాడు.సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వ్యక్తిపై చేయి కూడా చేసుకున్నాడు.

ఈ తతంగం చూసిన పెళ్లి కూతురికి అతనిని ఎంతమాత్రం పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పింది.వధువు తల్లిదండ్రులు కూడా పెళ్లి కొడుకు వ్యవహారం నచ్చకపోవడంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు తేల్చేసారు.

పెళ్లి కొడుకును, అతని తండ్రి, మరో ఇద్దరు బంధువులను బంధించి వరకట్నం కింద తీసుకున్న 10 లక్షలు చెల్లిస్తేనే విడిచిపెడతామని చెప్పారు.దీంతో తప్పని సరి పరిస్థితిలో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు దానికి అంగీకరించడంతో వారిని విడిచిపెట్టారు.

ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

.

తాజా వార్తలు