గుర్రంపై నుంచి దూకి పెళ్లి డ్రెస్ విప్పేసి నానా హంగామా చేసిన వరుడు.. ఎందుకంటే..?!

మన భారతదేశం తో పెళ్లికి సంబంధించి పెళ్లి కూతురు వారు పెళ్లి కొడుకు వారికి కట్ల కానుకలు ఇవ్వడం చట్టరీత్యా నేరం.ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన కానీ ఏ ఒక్కరూ పాటించారు.

 Groom Jumps Form Horse And Strips His Dress For Bullet Bike As Dowry In Up Hathras-TeluguStop.com

ఇందులో భాగంగానే పెళ్లిలో వధువు తరపువారు వరుడికి కట్నకానుకలు ఇవ్వడంతోపాటు వాహనాలు కూడా ఇస్తామని చెప్పడం మనం వింటూనే ఉంటాం.అయితే ఇలా మాట ఇచ్చాక ఇవ్వకపోతే ఏం చేస్తారో ఓ వరుడు చేసి చూపించాడు.

కొందరైతే అత్తింటివారు ఏదో లాంఛనంగా ఇస్తానని చెప్పిన అది ఇవ్వకపోయినా ఆ సమయానికి సరిపెట్టుకొని పెళ్లి తర్వాత అయినా ఆ లాంఛనాలను, పెళ్లి తంతును ముందుకు కొనసాగిస్తారు.అయితే ఈ పెళ్లి కొడుకు మాత్రం పెళ్లి ఊరేగింపులో పిచ్చి పట్టినట్టుగా అందరి ముందు నానా హంగామా చేశాడు.

 Groom Jumps Form Horse And Strips His Dress For Bullet Bike As Dowry In Up Hathras-గుర్రంపై నుంచి దూకి పెళ్లి డ్రెస్ విప్పేసి నానా హంగామా చేసిన వరుడు.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లి కార్యక్రమంలో భాగంగా వరుడు గుర్రం పైకి ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో వరుడు గుర్రం పై నుండి కిందికి దిగి పెళ్లి డ్రెస్ విప్పేసి పెద్ద రచ్చ రచ్చ చేశాడు.

వరుడికి వధువు ఇంటి వారు బుల్లెట్ బైక్ ఇస్తానని చెప్పి అపాచీ బైక్ ఇవ్వడంతో వరుడు రచ్చ రచ్చ చేశాడు.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ నగరంలో జరిగింది.ఒక బైక్ బదులు మరొక బైక్ ఇవ్వడంతో ఏకంగా పెళ్లి ముస్తాబులో గుర్రం మీద ఉన్న వ్యక్తి గుర్రం పై నుండి దూకేసి ఆ పై పెళ్లి దుస్తులు విప్పేసి రోడ్డుపై నానా హంగామా చేశాడు.

దీంతో పెళ్లికూతురు తరపువారు భయబ్రాంతులకు లోనయ్యారు.పెళ్లి కూతురు వారు మొదటగా పెళ్ళికొడుకుకి కాస్త సర్ది చెప్పడానికి ప్రయత్నించిన పెళ్లికొడుకు మాత్రం దానికి ససేమిరా అంటూ నానా తతంగం చేసేసాడు.

Telugu 10 Lac Dowry, Apachi, Bullet Bike, Dowry, Groom Jumps From Horse, Groom Strips Marriage Dress, Hathras, Marraige, Police, Uttar Pradesh, Viral-Latest News - Telugu

అయితే ఈ విషయం కాస్తా పోలీసులకు తెలిసిపోవడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని అక్కడ అ వరుడితో పాటు అతని తండ్రి అలాగే వారి బంధువులను పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఇకపోతే పెళ్లికి ముందే పెళ్లి కొడుకు అసలు మనస్తత్వం బయటపడడంతో కూతురిని అతనికి ఇచ్చి పెళ్లి చేయనని తండ్రి తేల్చి చెప్పాడు.అంతేకాదు సదరు పెళ్లి కూతురు కూడా ఒక బైక్ కోసమే ఇంత హంగామా చేసే ఇంటికి తాను కూడా వెళ్ళనని తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ తేల్చి చెప్పింది.తన తండ్రిని ఇంతగా అవమానించిన వాడిని తాను పెళ్లి చేసుకొని పెళ్లి కూతురు తెగేసి చెప్పింది.10 లక్షల రూపాయల కట్నం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఈ వివాహంలో బుల్లెట్ వాహనం ఇవ్వకపోవడంతో ఈ నానా హంగామా జరిగింది.

#GroomStrips #10 Lac Dowry #Marraige #Bullet Bike #Hathras

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు