నవ వరుడు కి కరోనా పాజిటివ్,మరి వధువు పరిస్థితి!

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొన్నటివరకు లాక్ డౌన్ లో ఉన్న విషయం తెలిసిందే.దీనితో చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు.

 Bride Sent To Quarantine Center, Covid 19 Ap News, Groom In Isolation Kurnool, C-TeluguStop.com

అయితే కొంతమంది అయితే లాక్ డౌన్ నిబంధనలు సడలించడం తో కొద్దీ మందిని మాత్రమే పిలుచుకొని పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు.అలాంటి ఘటనే కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

కరోనా టైం లో పెళ్లి చేసుకుందాం అని ఒక యువకుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు.ఈ నెల 10న అతడి వివాహం కొద్దీ మంది బంధువుల మధ్య జరిగిపోయింది.

అయితే కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం మర్రి మాను తండా కు చెందిన ఆ యువకుడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.
అయితే ఆ యువకుడి కి వెల్దుర్తి మండలం ఎల్.తండా కు చెందిన యువతితో వివాహం నిశ్చయం అవ్వడం తో ఇటీవల హైదరాబాద్ నుంచి ఏపీ కి వచ్చాడు.ఈ సమయంలో కరోనా పరీక్షలకు నమూనాలను కూడా ఇచ్చాడు.

అయితే ఫలితాలు రాకముందే ఈ నెల 10 వ తేదీన ఆ యువతిని వివాహం చేసుకున్నాడు.అయితే అదే రోజు రాత్రి జారిన రిసెప్షన్ లో అతడు అస్వస్థతకు గురయ్యాడు.

అదే సమయంలో ఆతడి కరోనా పరీక్షలు కూడా వెల్లడవ్వడం తో అతడికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది.దీనితో అతడిని ఐసోలేషన్ సెంటర్ కి తరలించి నవదువు ను మాత్రం క్వారంటైన్ సెంటర్ కి తరలించినట్లు తెలుస్తుంది.

అలానే ఈ పెళ్లి వేడుక కోసం వచ్చిన బంధువులతో వరుడు సహపంక్తి భోజనాలు చేసినట్లు తేలడం తో ఇప్పుడు వారిని కూడా పరీక్షించే పనిలో పడ్డారు.అంతేకాకుండా ఆ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా గుర్తించారు.

మొత్తం 70 కుటుంబాల నుంచి నమూనాలను సేకరించినట్లు తెలుస్తుంది.దీనితో కరోనా కాలంలో పెళ్లి చేసుకున్న నవ వధూవరుల కుటుంబాలతో పాటు గ్రామాల్లోనూ కోవిడ్ మహమ్మారి కలకలం రేపినట్లు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube