ధర్నాలో పాల్గొన్న వరుడు.. కాలేజీ కోసమేనట!

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించే వేడుక పెళ్లి.చాలా మంది తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని చూస్తుంటారు.

 Groom Halts Wedding To Join Protest In Uttar Pradesh-TeluguStop.com

ఈ క్రమంలో కొందరు చేసే హడావుడి మామూలుగా ఉండదు.తమ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకుంటారు.

అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి జరిగే సమయంలో అకస్మాత్తుగా ఆపేస్తుంటారు కొందరు.అయితే ఓ పెళ్లిని ఆపేసింది ఎవరో తెలిస్తే అవాక్కవ్వడం ఖాయం.

తన పెళ్లిని స్వయంగా ఓ పెళ్లికొడుకు ఆపేశాడు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని మహోబాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ గతకొంత కాలంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో కొందరు యువకులు నిరసన చేపట్టారు.డిసెంబర్ 1న రాత్రి సమయంలో పెళ్లి చేసుకోబోయే ఓ వరుడు, యువకులు చేపట్టిన నిరసన గురించి తెలుసుకుని, తన పెళ్లిని ఆపేసి వారికి మద్దతుగా వెళ్లి నిరసన తెలిపాడు.

మహోబాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఆ యువకులు తెలిపారు.

నలుగురికి ఉపయోగపడే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ ఆ వరుడు తీసుకున్న నిర్ణయం నిజంగా హర్షణీయం అంటూ పలువురు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

కాగా ఆ వరుడికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube