గాడిద ఎక్కి ఊరేగిన పెళ్లి కొడుకు.. చివరికి ఏమైందంటే?

సాధారణంగా పెళ్లి ఊరేగింపు అంటే వరుడు గుర్రం ఎక్కుతాడు.గుర్రం అందుబాటులో లేని ప్రాంతాల్లో డెకరేట్ చేసిన కారు లేదా ఇతర వాహనాల్లో పెళ్లి కొడుకు ఊరేగింపు జరుగుతుంది.

 Groom, Donkey, Marriage, Indore, Winter Season,-TeluguStop.com

అయితే మధ్యప్రదేశ్ లోని ఒక పెళ్లికొడుకు మాత్రం గాడిద మీద ఊరేగాడు.గాడిద మీద ఊరేగడం ఏమిటి…? అని ఆశ్చర్యపోతున్నారా…? గాడిద మీద వరుడు ఊరేగితే అందరూ నవ్వుతారనే సంగతి తెలిసిందే.అయితే ఆ వరుడు గాడిద మీద ఊరేగడానికి ముఖ్య్ కారణం ఉంది.

గాడిద మీద ఎక్కిన వ్యక్తి ఊరికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ పని చేశాడు.

గాడిద మీద ఊరేగి తన మొక్కును చెల్లించుకున్నాడు.మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇండోర్ లో గత రెండు నెలలుగా వర్షాలు కురవకపోవడంతో సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుడు గాడిద మీద ఎక్కి ఊరేగాడు.

సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ రెండవ వారం నుంచి వర్షాకాలం మొదలవుతుంది.

కానీ ఇండోర్ లో వర్షాలు పడటం లేదు సరికదా ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.ఇండోర్ కు సమీపంలో ఉన్న గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.

దీంతో ఇండోర్ నగర అధ్యక్షుడు శివ డింగు గాడిద మీద పెళ్లికొడుకు వేషం వేసుకుని నగర నడిబొడ్డు నుంచి శ్మశానవాటిక వరకూ ఊరేగింపుగా వెళ్లాడు.శ్మశానవాటికలో ఉప్పు పోసి వర్షలు కురవాలని ప్రార్థించాడు.

తమ పెద్దలు వర్షాలు కురిసేందుకు ఈ సాంప్రదాయం ఫాలో అయ్యారని… తాను ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నానని శివ్ డింగు చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube