పెళ్లికూతురు ముందు ఇలాంటివి అవసరమా బ్రో.... వీడియో వైరల్....

ప్రస్తుతం మన సమాజంలో చాలా రకాల పెళ్లిళ్లు జరుగుతూ ఉన్నాయి.నేటి యువత వారి పెళ్లిలను ఎవ్వరూ చేసుకొని విధంగా కొత్త కొత్త పద్ధతులలో చేసుకుంటూ ఉన్నారు.

 Groom Doing Crazy Stunts Infront Of Bride With Bike Video Viral Details, Groom ,-TeluguStop.com

కొందరు సముద్రంలో, మరికొందరు విమానంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా నేటి తరం యువతకు నచ్చినట్లు వారి పెళ్లిలను చేసుకుంటున్నారు.ఇలాంటి కొత్త రకాల పెళ్లిళ్లల కు సంబంధించిన కొన్ని వీడియోలు సరదాగా ఉంటాయి.

కొన్ని వీడియోలలో పెళ్లికూతురు లేదా పెళ్లి కొడుకు వారి అత్యుత్సాహంతో చేసిన కొన్ని పనులు నవ్వులాటగా మారుతూ ఉంటాయి.సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు మండపానికి ఊరేగింపుగా వెళతాడు.

కారు లేదా గుర్రంపై హుషారుగా వెళ్లడం మనం చూసే ఉంటాం.ఇటీవల కొంతమంది బుల్లెట్లపై కూడా వెళుతున్నారు.వెరైటీగా విన్యాసాలు చేస్తూ మండపానికి చేరుకుంటున్నారు.సోషల్ మీడియా లో బాగా వైరలవుతోన్న ఈ వీడియోలో వరుడు బైక్‌ పై స్టంట్స్ చూపిస్తూ తన వధువు వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు.

కానీ దురుదృష్టవశాత్తూ పెళ్లికూతురు ముందే కింద పడిపోతాడు.పెళ్లి కొడుకు బంధువులు బుల్లెట్‌పై వస్తోన్న పెళ్ళి కొడుకుని ప్రోత్సహించాలనుకున్నారు.

కానీ అతను హై స్పీడ్ బైక్ నడుపుతూ అదుపుతప్పి పెళ్లి కూతురు ముందే క్రింద పడి గాయాల పాలయ్యాడు.

దీంతో వధువు, ఆమె కుటుంబ సభ్యుల ముందర పడి అతని బైక్ స్టంట్ నవ్వుల స్టంట్ గా మారిపోయింది.ఎందుకంటే అతను హెల్మెట్ ధరించకపోయినా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు ఆ పెళ్ళికొడుకు.కేవలం 10 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 5 లక్షలకు పైగా చూశారు.అలాగే వేలాదిమంది లైకులు, కామెంట్లు పెడుతున్నారు.‘కొంచెం చూసుకోవాలి కదా భయ్యా.పెళ్లికి ముందు ఇలాంటి స్టంట్లు అవసరమా’ అంటూ ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు.ఇలాంటి బైక్ స్టంట్ల జోలికి పెళ్ళికొడుకులు వెళ్లకుండా ఉండడం చాలా మంచిదని కూడా కొంతమంది పెద్దవారు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube