వధువుకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుడు.. వీడియో వైరల్..

ప్రపంచంలోని ఏ దేశంలో చేయనంత ఘనంగా భారతదేశంలో పెళ్లిళ్లు చేస్తుంటారు.ముఖ్యంగా సినిమాల్లో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్‌గా జరపొచ్చో కళ్లకి కట్టినట్టు భారతీయ దర్శకనిర్మాతలు చూపిస్తుంటారు.వాటిని చూసి ఫాలో అయిపోతున్నారు సామాన్య ప్రజలు.తాజాగా ఒక వరుడు కూడా సినిమా స్టైల్ లో తన వెడ్డింగ్ ప్లాన్ చేసి వధువుకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

 Groom Dances On Famous Salman Khan Song, Surprises Bride, Bride, Groom, Viral Vi-TeluguStop.com

అతడు తన చెల్లెళ్లతో కలిసి వెడ్డింగ్ వెన్యూలో సల్మాన్‌ఖాన్‌ పాటకు డ్యాన్స్ చేస్తూ అబ్బుర పరిచాడు.అందరి ముందు తన భర్త, ఆయన చెల్లెలు ఆప్యాయంగా తన కోసం డ్యాన్స్ ఆమె చేయడంతో పరవశించి పోయింది.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో లో… వరుడు, అతని చెల్లెలు కుచ్ కుచ్ హోతా హై సినిమాలోని ఫేమస్ సాంగ్ “సాజంజి ఘర్ ఆయే” పాటకు డ్యాన్స్ చేయటం చూడొచ్చు.

ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ రూపొందించాడు కుమార్ సాను, అల్కా యాగ్నిక్ ఈ పాటను అద్భుతంగా పాడారు.అయితే ఇలాంటి రొమాంటిక్ పాటకు వరుడు డ్యాన్స్ చేస్తూ ఆయన తన జీవితంలోకి ఆహ్వానించడంతో వధువు ఫిదా అయిపోయింది.

సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ చాలా క్యూట్ గా వధువు కనిపించింది.

ఈ వీడియోని వెడ్డింగ్ వరల్డ్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.పెళ్ళికొడుకు మధుసూదన్ ఆరోరా పెళ్లికూతురు సలోనికి వెల్కమ్ చెబుతున్నాడు అని ఇన్ స్టాగ్రామ్ పేజీ ఒక క్యాప్షన్ జోడించింది.ఈ వీడియోకి ఇప్పటికే వేలలో లైక్స్ వచ్చాయి.

లక్షల వ్యూస్ వచ్చాయి.వరుడు వధువుని సూపర్ గా సర్‌ప్రైజ్‌ చేసి ఆమెలో ఆనందాన్ని నింపాడని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లి కూతురు వర్ణించలేనటువంటి ఆనందంలో మునిగి తేలుతుంటే చూడటానికి భలే ముచ్చట గా ఉందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube