పెళ్లి పీటలు ఎక్కాల్సిన టైంలో వధువు తల్లి, వరుని తండ్రి జంప్  

Surat groom father fled with bride mother - Telugu Fled With Bride Mother, Gujarat, Indian Marriage, Surat Groom Father

పెళ్లి బంధంతో ఒకటి అవ్వాల్సిన అమ్మాయి, అబ్బాయి మధ్య రిలేషన్ పెళ్లి పీటలు ఎక్కడానికి కొద్ది సేపటి ముందు మారిపోతుందని అసలు ఊహించి ఉండరు.వివాహంతో ఒకటై భార్యాభర్తలుగా కలిసి బ్రతకాల్సిన వారు అన్నా చెల్లి క్రింద మారిపోతే అంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదని చెప్పాలి.

Surat Groom Father Fled With Bride Mother

ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు చాలా వింతగా జరుగుతూ ఉంటాయి.ఇప్పుడు కూడా అలాంటి ఘటన గుజరాత్ లో సూరత్ జిల్లాలో జరిగింది.

అమ్మాయి, అబ్బాయి పెళ్లి పీటలు ఎక్కాల్సిన టైంలో అమ్మాయి తల్లి, అబ్బాయి తండ్రి జంప్ అయిపోయారు.దీంతో వారిద్దరి పెళ్లి ఆగిపోయింది.

ఫిబ్రవరిలో వివాహం చేసుకోవడానికి అమ్మాయి, అబ్బాయి రెడీ అయ్యారు.అయితే పెళ్లికి ముందు వధువు తల్లి, వరుని తండ్రి కలసి పరారయ్యారు.వరుడు తండ్రికి, వధువు తల్లికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది.అయితే పెళ్లి బంధంతో రెండు కుటుంబాలు కలవాలని అనుకున్న వారిద్దరు మాత్రం తాము పెళ్లి చేసుకొని భార్యాభర్తలు కావాలని అనుకున్నారు.

కాటర్గామ్ ప్రాంతంలో ఉంటున్న యువకునికి నవ్సారీ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం చేయాలని నిర్ణయించారు.పెళ్లికి నెల రోజుల ముందు ఆ యువతి తల్లి అదృశ్యమయ్యింది.

దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇంతలోనే వరుని తండ్రి కూడా కనిపించకుండా పోయాడు.

దీనిపై వారు కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు.అయితే కనిపించకుండా పోయిన వారిద్దరు వివాహం చేసుకునివుంటారని రెండు కుటుంబాలవారు భావించారు.

దీంతో అమ్మాయి, అబ్బాయి పెళ్లిని రద్దు చేసుకున్నారు.ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

#Indian Marriage #Gujarat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Surat Groom Father Fled With Bride Mother Related Telugu News,Photos/Pics,Images..