వామ్మో.. ఈ పెయింట్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

నాగార్జున నటించిన ఊపిరి సినిమా అందరికీ తెలిసే ఉంటుంది.ఊపిరి సినిమాలో ఒక డాట్ ఉన్న ఆర్ట్ ను ఎంతో ఖరీదు చేసి నాగార్జున కొంటాడు.

 Grimes Sells Digital Art Collection 5 8 Million Dollars 20 Minutes-TeluguStop.com

అందులో ఏముందని అడగగా ఒక ఆర్ట్ గొప్పదనం ఒక ఆర్టిస్ట్ కు మాత్రమే తెలుస్తుంది అని నాగార్జున చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయింది.అచ్చం అలాంటి ఆర్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ సింగర్ గ్రైమ్స్ ఒక ఆర్ట్ ను వేలం వేశారు.ఈ వేలంలో గ్రైమ్స్ కొన్ని మిలియన్ డాలర్లను దక్కించుకున్నారు.

 Grimes Sells Digital Art Collection 5 8 Million Dollars 20 Minutes-వామ్మో.. ఈ పెయింట్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ ఆర్ట్ లో ఉన్న గొప్పతనం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సింగర్ గ్రైమ్స్ వేసిన పెయింటింగ్ మార్స్ ను ఓ బేబీ కాపాడుతున్నట్లుంది.

ఈ డిజిటల్ ఆర్ట్ వర్క్ వేలంలో కొన్ని మిలియన్ డాలర్లను సంపాదించడం ఒక విశేషం అయితే, ఆ ఆర్ట్ ను క్రిప్టో కరెన్సీలో అమ్మటం మరో విశేషం అని చెప్పవచ్చు.సింగర్ గ్రైమ్స్ వేసిన పెయింటింగ్ ను వేలానికి పెడుతున్నట్లు ట్విట్టర్లో ట్వీట్ చేసిన 20 నిమిషాల వ్యవధిలోనే ఆ ఆర్ట్ ఏకంగా 5.8మిలియన్ డాలర్ల(రూ.42 కోట్ల)కు అమ్ముడుపోవడం ఎంతో విశేషం.ప్రస్తుతం మార్కెట్లో క్రిప్టో ఆర్ట్ విలువ 100 కోట్లకు పైగా ఉంది.

గ్రైమ్స్  వేసిన ఈ పెయింటింగ్ లో ఉన్న బేబీ అచ్చం ఎలాన్ మస్క్, గ్రైమ్స్ కి కలిగిన సంతానం లాగా పోలి ఉండటంతో ఈ ఆర్ట్ మరింత వైరల్ గా మారింది.

ఈ ఆర్ట్ అమ్మగా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని కార్బన్ 180 కి విరాళంగా ప్రకటిస్తానని గ్రైమ్స్ ఇదివరకే ప్రకటించారు.గ్రైమ్స్ కార్బన్ 180 ఉద్గారాలను తగ్గించడానికి తీవ్ర కృషి చేస్తున్నారు.

ఎలోన్ మస్క్ కూడా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం గురించి బహిరంగంగా మాట్లాడారు.అదేవిధంగా ఎలోన్ మస్క్ “డెత్ ఆఫ్ ద ఓల్డ్” అనే మరో ఆర్ట్ పీస్ ను గ్రైమ్స్ సుమారు 4,00,000 డాలర్లకు విక్రయించారు.

ఎన్ఎఫ్టీ ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతున్న వారిలో సింగర్ గ్రైమ్స్ కూడా ఒకరు.ప్రస్తుతం ఈమె ఆర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది ఆర్టిస్టులను ఆకట్టుకుంది.

#Mars #Elon Musk #Cryptocurrency #Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు