గృహలక్ష్మీ లాస్య సందడి.. ఆన్ స్క్రీన్ మామతో యాంకర్ ప్రశాంతి రచ్చ

సోషల్ మీడియా ప్రభావం అందరిలో విపరీతంగా పెరిగిపోయింది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటున్నారు.

 Grihalakshmi Lasya Anchor Prashanti Reel Video With Mamaya, Lasya, Guihalakshmi,-TeluguStop.com

ముఖ్యంగా సెలబ్రెటీలకు సోషల్ మీడియా ఒక వ్యసనంలా మారిందని చెప్పవచ్చు.తాము ఏమి చేసినా వాటిని సోషల్ మీడియా వేదికగా తెగ షేర్ చేసుకుంటున్నారు.

ఇప్పటికి ఎంతో మంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు పంచుకున్నారు.ఇక ఫోటో షూట్ విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ముఖ్యంగా బుల్లితెర సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.సీరియల్ నటీనటులు, ఎంటర్టైన్మెంట్ షోలు చేసే ఆర్టిస్టులు ఖాళీ సమయం దొరికితే చాలు సెట్ లో ఇన్ స్టా రీల్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.

ఇప్పటికే చాలామంది సీరియల్ నటీనటులు తమ తోటి నటులతో ఫన్నీ రీల్స్ చేస్తూ తమ సోషల్ మీడియా వేదికగా తెగ పంచుకుంటున్నారు.తాజాగా గృహలక్ష్మి సీరియల్ లాస్య కూడా తన ఆన్ స్క్రీన్ మామతో రచ్చ రచ్చ చేసింది.

ఇంతకీ అసలు ఏం చేసిందో తెలుసుకుందాం.

ప్రస్తుతం బుల్లితెర పై మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి.

ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.పైగా అందులో ఉన్న పాత్రలు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

అందులో తులసి, నందు, లాస్య పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సీరియల్ మొత్తం ఈ ముగ్గురు పైనే కొనసాగుతుంది.

ఇందులో లాస్య అలియాస్ ప్రశాంతి విలన్ పాత్రతో బాగా మెప్పిస్తుంది.ఇక ఈమె మొత్తానికి నందుని పెళ్లి చేసుకొని అనుకున్నది సాధించుకుంది.ఈ సీరియల్ తో ప్రశాంతి మంచి క్రేజ్ సంపాదించుకుంది.కెరీర్ మొదట్లో ప్రశాంతి యాంకర్ గా పలు షోలలో చేసింది.యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

కానీ ఎందుకో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఒక నటిగా కంటే, యాంకర్ గా కంటే వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

గతంలో ఈమె మద్యం సేవించి స్టేడియంలో హంగామా చేయడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.దీంతో ఈ సంఘటన తన కెరీర్ కు ప్రభావం చూపించిందనే చెప్పవచ్చు.

ఆ తర్వాత మెల్లమెల్లగా కోలుకుంటూ బుల్లితెరపై అడుగుపెట్టింది.

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో విలన్ పాత్ర తో మళ్లీ మంచి సక్సెస్ అందుకుంది.ఈ గ్లామర్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లను బాగా పిచ్చెక్కిస్తుంది.

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది.

తన డాన్స్ వీడియోలతో మాత్రం కుర్రాళ్ళను ఫిదా చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియోని షేర్ చేసుకుంది.

అందులో గృహలక్ష్మి సీరియల్ లో తన మామ క్యారెక్టర్ ను చేస్తున్న నటుడుతో ఫన్నీ రీల్ చేసింది.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు ఆ వీడియోకు తెగ లైకులు కొడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube