వావ్: కొత్త రంగు లో కాసిన పచ్చిమిర్చి...! ఎంత బాగుందో కదా...?!

ఇప్పటివరకు మనం ఎప్పుడైనా సరే ఆకుపచ్చ, ఎరుపు రంగులో పచ్చిమిరపకాయలను చూసి ఉంటాం.ఈ రెండు తప్పించి మూడోరకం రంగు కలిగిన పచ్చిమిరపకాయలను మనం చూసి ఉండరు కదా.

 Green, Purple, Yellow, Red, Orange, Chilli, Twitter-TeluguStop.com

అయితే ఇప్పుడు వివిధ రంగుల్లో లో పచ్చి మిరపకాయలు పండిస్తున్నారు విదేశాలలో.అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే… మిర్యామ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోలతో ఇప్పుడు ఆయన టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.

అతను షేర్ చేసిన ఫోటోలలో వివిధ రకాల రంగుల్లో ఉన్న పచ్చిమిర్చి కనపడుతున్నాయి.

ఇకపోతే ఈ పచ్చి మిరపకాయలు అన్ని తన ఇంట్లోనే కాసినట్లు ఆయన చెబుతున్నారు.

ఇందుకు సంబంధించిన విషయాలు చూస్తే… ఇవి ఆరెంజ్, పర్పుల్ కలర్స్ లో కూడా ఇవి దర్శనమిచ్చాయి.ఇందులో ముఖ్యంగా పర్పుల్ కలర్ పచ్చిమిరపకాయ చూడటానికి ఎంతో బాగుందో తెలుసా…! ఇకపోతే వీటిని బ్యునా ములటా చిల్లీ అని పిలుస్తారట.

అయితే ఇది 1500 సంవత్సరాల నుండి ఇలాగే వివిధ రంగుల్లో కాస్తున్నాయ్ అని ఆయన తెలియజేశారు.అయితే ఇది కేవలం అరుదుగా దొరికే పచ్చి మిర్చి రకం అని తెలుస్తోంది.

అయితే మామూలుగా మనం వంట లో ఎలా పచ్చిమిరపకాయలను ఉపయోగిస్తామో, వీటిని కూడా అలాగే వాడతారట.

ఈ పచ్చిమిరపకాయల వెరైటీ చూస్తే… ఇది వాతావరణాన్ని బట్టి వాటి కలర్స్ ను మారుస్తూ ఉంటాయట.

ఇవి మొదటగా పర్పుల్ కలర్ లో కచాక, ఆ తర్వాత ఆరెంజ్ కలర్ లోకి మారి ఆపై ఎరుపు కలర్ కు మారుతాయని తెలిపారు.సదరు వ్యక్తి సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేయగానే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అనేకమంది గూగుల్ లో సెట్ చేస్తున్నారు.

వీటికి సంబంధించి పచ్చిమిర్చి కారం ఏ విధంగా ఉంటుంది, వాటిని ఎలా ఉపయోగించి చేసుకోవచ్చని అడుగుతున్నట్లు ఆయన తెలియజేశారు.అంతేకాదు ఇందుకు సంబంధించి ఆయన ఓపికగా వారికి సమాధానాలు చెబుతున్నాడు కూడా.

ఇలాంటి పచ్చి మిర్చి రకం విత్తనాలను ఆన్ లైన్ లో ఈ కామర్స్ లో కొనుక్కోవచ్చని తెలుపుతున్నాడు.అయితే కొన్న తర్వాత ఆ వాతావరణ పరిస్థితులను బట్టి ఇలాంటివి పండుతాయో లేదో ముందుగా తెలుసుకొని కొంటే బెటర్ అని సలహా ఇస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube