ఇందేందయ్యా ఇది: ఆకుపచ్చ వర్ణంలో జన్మించిన కుక్క పిల్ల..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను ఇట్లే తెలుసుకుంటున్నాం.ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ గా మారిపోతున్నాయి.

 Rare Green Puppy Born In Italy, Pistachio, Green Colour Puppt, Italy, Green Fur-TeluguStop.com

అందులో మరీ ఎక్కువగా పక్షులు, జంతువుల కు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం చూస్తూనే ఉన్నాం.అయితే తాజాగా ఓ కుక్క కు సంబంధించిన విషయం తెగ వైరల్ గా మారింది.

ఇక అసలు విషయంలోకి వెళితే.

మామూలుగా మనం చూసే కుక్కలు ఎలాంటి రంగులో ఉంటాయి.? తెలుపు, నలుపు, గోధుమ వర్ణం కలయికలో వివిధ రకాల కుక్కలను మనం చూస్తూనే ఉంటాం.మరి ఎప్పుడైనా మీరు ఆకుపచ్చ వర్ణంలో ఉన్న కుక్కను చూశారా.? కుక్క ఆకుపచ్చ వర్ణం లో ఉండడం ఏంటి అని అనుకుంటున్నారు కదా.అవునండి బాబు ఈమధ్యనే ఇటలీలో కుక్కపిల్ల పూర్తిగా ఆకుపచ్చ వర్ణం లో జన్మించింది.ప్రస్తుతం ఈ కుక్కపిల్లలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.ఈ సంఘటన ఇటలీ దేశంలోని సార్డినియా ప్రాంతంలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

క్రిస్టియన్ మల్లోకి అనే ఓ రైతు కు స్పెలాచియా కుక్క ఉంది.ఈ కుక్క ఇటీవల నాలుగు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది.అందులో 3 కుక్కపిల్లలు మామూలుగానే తెలుపు వర్ణం లో ఉండగా ఒక్క కుక్క పిల్ల మాత్రం పూర్తిగా ఆకుపచ్చ వర్ణం లో జన్మించింది.ఈ అరుదైన కుక్కపిల్లకు పిస్తా అనే పేరును పెట్టారు యజమాని.

ప్రస్తుతం ఈ పిస్తా కుక్క కు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో వైరల్ గా మారాయి.ఇందుకు సంబంధించి నిపుణులు బిలివర్డిన్ అనే ఆకుపచ్చ వర్ణద్రవ్యం వలన ఆ కుక్క పిల్ల అలా ఆకుపచ్చ వర్ణంలో పుట్టిందని తెలుపుతున్నారు.

అయితే ఆకుపచ్చ వర్ణం అదృష్టానికి సంకేతంగా భావిస్తున్నట్లు యజమాని తెలిపారు.ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి కుక్కపిల్ల మా ఇంట్లోకి రావడం చాలా శుభసూచకంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube