ఆ కోడిగుడ్లు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం ఇదే...?

ఓ వారం క్రితం ఆకుపచ్చ రంగు కోడి గుడ్డు న్యూస్ ఎంత వైరల్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆకుపచ్చ రంగు కోడి గుడ్డు అని అంటేనే చాలా వింతగా ఉంది.

 Kerala Green Color Eggs Mystery Revealed, Kerala Green Eggs, White And Yellow Co-TeluguStop.com

ఎందుకంటే ఏ కోడి అయినా తెల్ల సోనా, పచ్చ సోనా ఉన్న గుడ్డును మాత్రమే పెడుతాయి.కానీ ఆ కోడి మాత్రం ఆకుపచ్చ రంగు గుడ్డుని పెట్టాయి.

ఇంకేముంది.ఈ వార్త సోషల్ మీడియా ఎక్కింది ఓ రెండు రోజులు వైరల్ అయ్యింది.

అది ఎందుకు అలా ఉంది.ఎప్పుడైనా ఆకుపచ్చ గుడ్లు ఎక్కడైనా ఉన్నాయా అని ఓ రేంజ్ లో సెర్చ్ చేశారు.అది ఇప్పుడు ఆ మిస్టరి బయటపడింది.అసలు ఈ ఆకుపచ్చ రంగు కోడి గుడ్డు కేరళ‌లోని మ‌ళ‌ప్పురం ప్రాంతానికి చెందిన ఏకే షిహాబుద్దీన్ అనే వ్య‌క్తి పౌల్ట్రీ ఫాంలో ఉన్నాయి.9 నెల‌ల కింద‌ట ఓ కోడి ఆకుప‌చ్చ రంగు సొన క‌లిగిన గుడ్ల‌ను పెట్టింది.

Telugu Green Eggs, Poultry Farm-General-Telugu

అయితే ఆ గుడ్లు వింతగా ఉన్నాయి అని షిహాబుద్దీన్ వాటిని తినకుండా ఆ గుడ్ల‌ను అత‌ను పొదిగించాడు.దీంతో ఆ గుడ్ల నుంచి పొద‌గ‌బ‌డిన కోడి పిల్ల‌లు కూడా ఇప్పుడు పెద్ద‌వై.అవి కూడా ఆకుప‌చ్చ రంగులో సొన క‌లిగిన గుడ్ల‌ను పెడుతున్నాయి.

అయితే ఈసారి షిహాబుద్దీన్ వాటిని ఉడ‌క‌బెట్టి రుచి చూస్తే అవి సాధార‌ణ కోడిగుడ్ల రుచే వచ్చాయి.దీంతో షిహాబుద్దీన్ స‌ద‌రు గుడ్ల‌కు చెందిన ఫొటోలు, వీడియోల‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చెయ్యడంతో అవి వైర‌ల్ అయ్యాయి.

వైరల్ అయితే అయ్యాయి కానీ.ఆ గుడ్లు ఆ రంగులో ఎందుకు ఉన్నాయ్ అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కలేదు.

అయితే ఇప్పుడు మిస్టరీ వీడింది.కోళ్లకు పెట్టిన ఆహారం వల్లగానీ లేదా సహజసిద్ధమైన రంగునిచ్చే మొగ్గలు తినడం వల్లగాని గుడ్లలో ఈ రంగు వచ్చినట్టు కేరళ వెటర్నరీ గుడ్లలో ఈ రంగు వచ్చినట్టు కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సీంస్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.

కోళ్లకు ఆహారం మార్చగా సహజమైన రంగులో గుడ్లు పెట్టాయని నిపుణులు వెల్లడించారు.దీని వెనుక ఎలాంటి జన్యుపరమైన సమస్యలు లేవని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube