భారతీయులు గ్రీన్ కార్డ్ పై ఆశలు వదులుకోవాల్సిందేనా…??  

Green Cards Prolong Indian Nris - Telugu Americans, Green Card, Indians, Prolong, Usa

ప్రపంచ దేశాలన్నిటి కంటే కూడా అమెరికాలో స్థిరపడాలని ఎంతో మంది భావిస్తారు.ప్రపంచ నలుమూల నుంచీ ఎంతో అమెరికాలో స్థిరపడాలని వలసలు వెళ్తూ ఉంటారు.

 Green Cards Prolong Indian Nris

ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉంటే ఆ దేశం శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్ కార్డ్ సాధించడమే ధ్యయంగా పెట్టుకుంటారు.ఒక్క సారి గ్రీన్ కార్డ్ వచ్చిందంటే చాలు ఇక అమెరికన్ గా వలసవాసులు గుర్తింపు పొందినట్టే.

అమెరికా ప్రజలు అనుభవించే అన్ని రకాల సదుపాయాలు వారు కూడా పొందుతారు.అయితే
తాజాగా కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇకపై వలస వాసులకి గ్రీన్ కార్డ్ అందని ద్రాక్షే అంటున్నారు.

భారతీయులు గ్రీన్ కార్డ్ పై ఆశలు వదులుకోవాల్సిందేనా…-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఎంతో మంది ఎన్నారై లు ఎన్నో ఏళ్ళుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా ఈ సర్వే వారి ఆశలపై నీళ్ళు చల్లింది.గ్రీన్ కార్డ్ అర్హత పొంది ఇంకా చేతికి అందకుండా ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఇప్పటికే 10 లక్షలు ఉంది.

ఇలా ఎదురు చూస్తున్న వారిలో భారతీయులే అత్యధికులు కావడం విశేషం.ఇదిలాఉంటే

గ్రీన్ కార్డ్ కోసం ఇలా వేచి చూస్తున్న వారి సంఖ్య 2030 నాటికి ఇప్పటికంటే కూడా రెండు రెట్లు అధికంగా ఉంటుదని లెక్కలు వేస్తున్నారు.తాజాగా సవరించిన చట్టాల ప్రకారం చూస్తే.భారత్,చైనా ల కాలపరిమితి ఈ సారి తగ్గనుంది.

దాంతో ఈబీ1 బ్యాక్ లాగ్ సంఖ్య 1,19,732 నుంచీ 2,68,246 కి చేరుకుంది ఇది 2030 కి జరగనున్న ప్రక్రియ.ఇక ఈబీ2 , ఈబీ3 వారి సంఖ్య కూడా 2030 నాటికి భారీగా పెరగనుందని ఈ క్రమంలో భారతీయులకి గ్రీన్ కార్డ్ రావడానికి దశాబ్దాలు పడుతుందని అంటున్నారు నిపుణులు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Green Cards Prolong Indian Nris Related Telugu News,Photos/Pics,Images..