టాలీవుడ్ లో గ్రేటర్ వార్ ?

రాజకీయాలకు అతీతంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు తీసుకు వెళుతూ, ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్యల పరిష్కారంపై ముందడుగు వేయాల్సిన టాలీవుడ్ ఇండస్ట్రీ గత కొంతకాలంగా రాజకీయ వ్యవహారాల లో మునిగి తేలుతూ, వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్నారు.టాలీవుడ్ లో రాజకీయ ప్రభావం ఇప్పటిది కాదు.

 Greater War On Tallywood Indrestry, Bjp, Congress, Nagababu, Pawan Kalyan, Posan-TeluguStop.com

ఎప్పటి నుంచో ఇండస్ట్రీకి చెందిన వారు వివిధ రాజకీయ పార్టీలో చేరడం, అనేక కీలక పదవులు పొందడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.అయితే ప్రస్తుతం వ్యవహారం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లడం పై టాలీవుడ్ పెద్దలు కొందరు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అన్నదమ్ముల వలె కలిసి ఉండే టాలీవుడ్ లో ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల చిచ్చు మొదలైంది.సినీ నటులు మధ్య రాజకీయ విమర్శలు ,ప్రతి విమర్శలు పెరిగిపోయి టాలీవుడ్ లో వేడి పుట్టిస్తోంది.

ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి జనసేన మద్దతు గా నిలబడింది.మొదట్లో ఆ పార్టీ పోటీ లో దిగినా, బీజేపీ ఒత్తిడితో వెనక్కి తగ్గింది.అయితే పవన్ కళ్యాణ్ పై తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ సంచలన విమర్శలు చేశారు.పవన్ రాజకీయాలు చేస్తున్నారని,గతంలో బీజేపీని పొగిడి, ఆ తరువాత తిట్టి మళ్ళీ ఇప్పుడు పొగుడుతున్నారని మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు ప్రతి విమర్శలు చేశారు.ప్రకాష్ రాజ్ చరిత్ర బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లు తేలిపోయిందని , రాజకీయ నిర్ణయాలు అనేకసార్లు మారుతూ ఉంటాయి అని,  మా నాయకుడు పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపికి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని,  ఎవరికి ద్రోహం చేశాడని.

ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు అంటూ నాగబాబు ఘాటుగా సమాధానం ఇచ్చారు.

 ఇప్పుడు ఈ వివాదం తారస్థాయికి వెళ్లేలా కనిపిస్తోంది.

మొదటి నుంచి ప్రకాష్ బిజెపికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో ఆ పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ జనసేన పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

వీరే కాదు, రాజకీయ వ్యవహారాలపై ఈ మధ్య కాలంలో సినీ నటులు చాలామంది పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ,  రాజకీయ అజెండాతో ముందుకు వెళుతుండటం,  తెలుగు సినిమా ఐక్యమత్యం దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకుని టాలీవుడ్ నటులు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ తమ రాజకీయ అజెండాను తెరపైకి తెస్తూ… తెర జీవితాన్ని ఇబ్బందుల పాలు చేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube