గ్రేట‌ర్ ఫ‌లితం.. ఏపీ టీడీపీకి మ‌రో షాక్ ఇలా ?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్ప‌రేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ ఫ‌లితం చూస్తే.ఎవ‌రికైనా నోట మాట‌రావ‌డం క‌ష్టం.

 Greater Results.. Big Shock To Ap Tdp?,ap,political News,telangana,political New-TeluguStop.com

ఎందుకంటే.గ్రేట‌ర్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ నుంచి ఎన్నిక‌ల‌కు నాలుగు రోజుల ముందు వ‌ర‌కు కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లోనే ఉన్నారు.

దాదాపు 92 స్థానాల్లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను ఆయ‌నే స్వ‌యంగా ఎంపిక చేశారు.నిత్యం ఆన్‌లైన్ కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హించా రు.“ఓటు అడిగే హ‌క్కు మ‌న‌కు త‌ప్ప ఎవ‌రికీ లేదు.ఆ దిశ‌గా ప్ర‌చారంలో దూసుకుపోండి!“ అని కార్య‌క‌ర్త‌ల‌కు, డివిజ‌న్ల అభ్య‌ర్థుల‌కు ఆయ‌న దిశానిర్దేశం చేశారు.

ఇక‌, నారాలోకేష్ కూడా ఆన్‌లైన్‌లోనే అన్నీ చ‌క్క‌బెట్టారు.

దీంతో టీడీపీ పుంజుకుంటుంద‌ని, ముఖ్యంగా సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌ప్ప‌కుండా అన్ని డివిజ‌న్ల‌ను కైవసం చేసుకుంటుంద‌ని అంచ‌నాలు వ‌చ్చాయి.

తీరా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.చూస్తే టీడీపీ ఒక్క‌టంటే ఒక్క చోట కూడా గెలుపు ల‌భించ‌లేదు.

సైబ‌రాబాద్‌ను తానే నిర్మించాన‌ని.హైద‌రాబాద్‌ను తానే క‌ట్టాన‌ని చెప్పుకొనే చంద్ర‌బాబుకు ఈ ఫ‌లితం నిజంగానే శ‌రాఘాతం.

గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌నీసం రెండు ప‌దుల స్థాయిలో అభ్య‌ర్థుల‌ను గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు ఒక్క స్థానం లోనూ విజ‌యం ద‌క్కించుకోలేదు.అయితే.

ఈ ఫ‌లితం గ్రేట‌ర్‌పై కంటే కూడా ఏపీ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏపీలో టీడీపీ ప‌రిస్థితి అధ్వానంగా ఉంది.

ఇక్క‌డ పార్టీ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది.పైగా పార్టీలో గెలిచిన అభ్య‌ర్థులు కూడా పార్టీకి, పార్టీ అధినేత‌కు డిస్టెన్స్ పాటిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు పిలుపునిచ్చిన కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకాని నాయ‌కులు కూడా చాలా మంది ఉన్నారు.ఇక‌, అసెంబ్లీ స‌మావేశాల‌కు డుమ్మాకొట్టిన ఎమ్మెల్యేలు కూడా ఐదారుగురు ఉన్నారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే టీడీపీపై న‌మ్మ‌కం స‌న్నిగిల్లుతోంద‌నే ఊహాగానాలు వ‌చ్చాయి.ఈ స‌మ‌యంలో పార్టీపై న‌మ్మ‌కం పెంచేలా గ్రేట‌ర్‌లో పుంజుకునేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశార‌ని ప్రచారం జ‌రిగింది.

సీనియ‌ర్లు కూడా పార్టీ పున‌రుత్తేజం అవుతుంద‌ని అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా గ్రేట‌ర్‌లో టీడీపీ ప‌త్తా లేకుండా పోయింది.

ఈ ప‌రిణామాలు ఏపీలో చంద్ర‌బాబు నాయ‌క‌త్వ‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు.ఇప్పుడు ఏపీలో ఏ టీడీపీ నేత‌ను ప‌ల‌క‌రించినా గ్రేట‌ర్ పోయింది.

అనే మాటే వినిపిస్తోంది త‌ప్ప మ‌రో మాటే లేదు.దీంతో మున్ముందు ఏపీలో వైసీపీ దూకుడు మ‌రింత పెరిగి గ్రేట‌ర్ ఫ‌లితాన్ని టార్గెట్ చేసే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

మ‌రి బాబు దీనిని ఎలా స‌మ‌ర్ధించుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube