ఏపీలో కొత్త పల్లవి... గ్రేటర్ రాయలసీమ కావాలంటా

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దయవల్ల ముక్కలైపోయింది.ఇక ఆంధ్రప్రదేశ్ ముక్కలైన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే ఏపీ పరిస్థితి రాను రాను తీసికట్టుగా తయారవుతుంది.

 Greater Rayalaseema Demand In Andhra Pradesh-TeluguStop.com

గత ఐదేళ్ళ కాలంగా అమరావతి అద్బుత రాజధాని అంటూ గ్రాఫిక్స్ బొమ్మలు చూపించిన చంద్రబాబు మాయాజాలం జనం అర్ధం చేసుకొని వైసీపీకి పట్టం కట్టారు.అయితే ఇప్పుడు అమరావతి రాజధానిని నామమాత్రంగా చేసి ఏపీకి మూడు రాజధానులు అని వైసీపీ ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటుంది.

ఈ మూడు రాజధానుల మాట వచ్చిన తర్వాత ఉత్తరాంద్ర ప్రజలు సంతోషంగా ఉన్న అమరావతి, రాయలసీమ రగిలిపోతుంది.అమరావతిలో రాజధాని ఉండాల్సిందే అని అక్కడి ప్రజలు పట్టుపడుతున్నారు.

అయితే ఈ నెల 28 జరిగే క్యాబినెట్ బేటీ తర్వాత ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయం స్పష్టం చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రాయలసీమలో ఈ మూడు రాజధానుల గొడవ మరో ఆందోళనకి తెరతీసినట్లు అయ్యింది.

తాజాగా ఏపీ సీఎం జగన్‌కు రాయలసీమ నేతలు లేఖ రాశారు.గ్రేటర్ రాయలసీమను రాజధాని చేయాలని కోరారు.గతంలో ఐక్యత కోసం రాజధాని కర్నూలు ప్రాంతాన్ని సీమ ప్రజలు త్యాగం చేశారని, ఇప్పుడు మరల త్యాగం చేసేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.ఈ లేఖ రాసిన వారిలో రాయలసీమ నేతలు మైసూరా రెడ్డి, శైలాజానాథ్, దినేష్ రెడ్డి ఉన్నారు.

ఒక వేళ రాజధానిగా కర్నూలుని చేయకపోతే ప్రత్యేక రాయలసీమ పోరాటానికి తెరతీస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా మైసూరా రెడ్డి మాట్లాడుతూ రాజధాని అయితే రాయలసీమ ప్రాంతలో రావాలన్నారు.

రాజధాని ఇవ్వకుంటే మా ప్రాంతాన్ని మాకివ్వాలని డిమాండ్ చేశారు.మేం ఏం ఆంధ్రా వాళ్లతో కలిసి అలింగనం చేసుకొని ఉంటానడం లేదు.

ఏపీ కేబినెట్ రాజధానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని మైసూరా రెడ్డి చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube