తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ రోజున అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ దీపావళి కానుకను ప్రకటించారు.

 Telangana Government Diwali Gift To People Of The State, Minister Ktr, Kcr, Home-TeluguStop.com

కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న్ రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకుని 2020 – 2021 ఆస్తిపన్నులో రాయితీ ప్రకటించారు.సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 వేల రూపాయలు.

రాష్ట్రంలో పది వేల రూపాయల లోపు ఆస్తి పన్ను చెల్లిస్తున్న వాళ్లకు 50 శాతం రాయితీ విధించనున్నారు.

ప్రజలు ఇప్పటికే ఆస్తిపన్నును చెల్లించి ఉంటే వచ్చే ఏడాది ఆస్తిపన్నులో ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని సర్దుబాటు చేయనుంది.

మంత్రి కేటీఆర్ కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ విషయాలను వెల్లడించారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం తమను ఆదుకుంటోందని చెబుతున్నారు.

Telugu Corona, Diwali Gift, Floods, Lock, Tax, Telangana-Political

కరోనా, లాక్ డౌన్ తో పాటు ఈ సంవత్సరం వర్షాలు తెలంగాణ ప్రజలను గజగజా వణికించాయి.ప్రభుత్వం వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించి సాయం చేసింది.తాజా ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లబ్ధిదారులకు 326 కోట్ల 48 లక్షల రూపాయల మేర లబ్ధి చేకూరనుందని తెలుస్తోంది.మంత్రి కేటీఆర్ వరద సాయం పంపిణీ చేశామని సాయం అందని వాళ్లు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్ కార్మికుల వేతనం 14,500 రూపాయల నుంచి 17,500 రూపాయలకు పెంచింది.కరోనా కష్ట కాలంలో సైతం సేవలందించిన మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనం కలిగేలా చేసింది.

ఏకంగా 3,000 రూపాయల వేతనం పెంచడంతో మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube