కరోనా వైరస్ ఎఫెక్ట్: పర్యాటకానికి దెబ్బ, గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా మూసివేత  

Close Section Of Great Wall & Tourist Sites Over Spreading Coronavirus-great Wall Of China,nri,spreading Coronavirus,telugu Nri News Updates,గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా

కరోనావైరస్ ధాటికి ప్రస్తుతం చైనా వణికిపోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వైరస్‌ ఇతరులకు సోకకుండా డ్రాగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

Close Section Of Great Wall & Tourist Sites Over Spreading Coronavirus-Great China Nri Spreading Coronavirus Telugu Nri News Updates గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా

పర్యాటకంపైనా ఆంక్షలు విధిస్తున్న ఆ దేశం.ప్రఖ్యాత గ్రేట్‌వాల్ ఆఫ్ చైనాతో పాటు బీజింగ్‌లోని ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

మింగ్ సమాధులు, యిన్షాన్ పగోడా సైతం శనివారం నుంచి మూసివేయబడతాయని తెలిపింది.ఇదే సమయంలో బర్డ్స్ నెస్ట్ స్టేడియాన్ని సైతం మూసివేస్తున్నట్లు సంబంధిత అథారిటీ ప్రకటించింది.

డిసెంబర్ చివరి వారంలో తొలిసారిగా వుహాన్ నగరంలో బయటపడ్డ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.దీని కారణంగా ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోగా.

మరో 830 కేసులు నమోదయ్యాయి.వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు గాను చైనా ప్రభుత్వం ఆయా నగరాలపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా దీని జాడలు భారతదేశంలోనూ వెలుగుచూశాయి.చైనా నుంచి ముంబై వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఇద్దరు వ్యక్తులు జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో ప్రత్యేక వార్డులో పరీక్షిస్తున్నట్లు ముంబై మహానగర పాలక సంస్థ ప్రకటించింది.

తాజా వార్తలు

Close Section Of Great Wall & Tourist Sites Over Spreading Coronavirus-great Wall Of China,nri,spreading Coronavirus,telugu Nri News Updates,గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా Related....