భారతీయుడికి అమెరికాలో అరుదైన గౌరవం..!!!  

Great Honor For A Indian In America-committee,geographical Rules,great Honor,indian,knowledge,telugu Nri Updates,worldwide

ప్రపంచ వ్యాప్తంగా భారతీయులకి ఎప్పటికప్పుడు సముచిత స్థానం కలుగుతూనే ఉంది. భారతీయులకి ఉన్న అపారమైన మేధోసంపత్తి అందుకు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా అగ్రరాజ్యం అయిన అమెరికాలో భారతీయులు తమ ప్రతిభ ఆధారంగా ఉన్నత పదవుల్లో ఉంటూ రికార్డు సృష్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి..

భారతీయుడికి అమెరికాలో అరుదైన గౌరవం..!!!-Great Honor For A Indian In America

అయితే అమెరికా తాజాగా మరో భారతీయుడికి అరుదైన అవకాశం ఇచ్చింది. అతని ప్రతిభకి ఏరి కోరి మరీ ఓ కమిటీలో కీలక వ్యక్తిగా నియమించింది. భౌగోళిక పరిశోధనలు, మ్యాపింగ్‌, లోకేషన్‌ టెక్నాలజీల్లో భారత్‌ ఎన్నో నూతన పరిశోధనలు చేస్తూ వచ్చింది.

అయితే అమెరికా అందించే మ్యాప్ లు కాకుండా తమకంటూ స్వయంగా తమకంటూ ప్రత్యేకంగా ఓ మ్యాపింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేసుకొంది. అమెరికా భౌగోళిక విధానాలు, వాటి అములు కోసం ఏర్పాటు చేసిన నేషనల్ జియోస్పేషియల్‌ అడ్వైజరీ కమిటీ లో ఓ భారతీయుడికి సముచిత స్థానం కల్పించింది. ప్రపంచ భౌగోళిక పాలక మండలిలో కార్యదర్శిగా ఉన్న ఢిల్లీ కి చెందినా సంజయ్ కుమార్ ఈ ఘనత సాధించారు.

ప్రస్తుతం ఆయన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా ఉన్న కేత్‌ మాస్బాక్‌ నేతృత్వంలో సంజయ్‌ సేవలందిచనున్నారు