దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. సంభవించిన భారీ నష్టం.. !

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే కరోనా వల్ల కోలుకోలేని విధంగా ఉన్న సంగతి తెలిసిందే.దీనికి తోడు వాతావరణ కాలుష్యం కోరల్లో చిక్కుకుని అల్లాడుతుంది.

 Great Fire In The National Capital Delhi-TeluguStop.com

ఇది చాలదన్నట్లుగా అగ్నిప్రమాదాలు అతిధుల్లా పలకరిస్తున్నాయి.కాగా ఇదేక్రమంలో ఢిల్లీలోని శాస్త్రిపార్క్‌ ఫర్నిచర్‌ మార్కెట్‌లో శనివారం అర్ధరాతి ఘోర అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇక మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలకు మంటలు వ్యాపించగా, ఈ ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లుగా సమాచారం.

 Great Fire In The National Capital Delhi-దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. సంభవించిన భారీ నష్టం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని కూడా రక్షించారట.

ఇక ప్రమాదంలో సుమారు 250 ఫర్నిచర్‌, హార్డ్‌వేర్‌ దుకాణాలకు మంటలు వ్యాపించగా.అందులోని సామగ్రి అగ్నికి ఆహుతైందని అధికారులు వెల్లడించారు.

అయితే ఈ ప్రమదానికి గల కారణాలు ఇంకా నిర్దారించలేదని తెలిపారు.

#Delhi #Fire #Breaks #Shastri Park

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు