మహా ఆర్థిక సంక్షోభం : ఒక్క నెలలో 43 లక్షల మంది ఉద్యోగుల రాజీనామా..!

Great Financial Crisis 43 Lakh Employees Resign In One Month

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెను సంక్షోభం నెలకొంది.అగ్రరాజ్యాలు మొదలుకుని చిన్నదేశాలు సైతం ఒక్కసారిగా కుదేలయ్యాయి.

 Great Financial Crisis 43 Lakh Employees Resign In One Month-TeluguStop.com

దీంతో ఒకానొక సమయంలో ప్రపంచం మళ్లీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందనే సంకేతాలినిచ్చాయి బడా కంపెనీలు.ఆయా కంపెనీల్లో ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తీసివేశాయి.

కరోనా కష్టకాలం అని చూడకుండా యాజమాన్యాలు చాలా కఠినంగా ప్రవర్తించాయి.వర్క్ ఫ్రంహోం పేరుతో ఎక్కువ పనిగంటలు, లే ఆఫ్‌లతో పాటే వేతన కోతలను ప్రారంభించాయి.

 Great Financial Crisis 43 Lakh Employees Resign In One Month-మహా ఆర్థిక సంక్షోభం : ఒక్క నెలలో 43 లక్షల మంది ఉద్యోగుల రాజీనామా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తీరా కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టడంతో అంతా నార్మల్ స్టేజీకి వచ్చింది.ఇప్పుడు కంపెనీలు మంచి ప్యాకేజీలు ఇస్తామన్నా ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోతున్నట్టు తెలిసింది.

అయితే, ఉద్యోగులు రిజైన్ చేయడానికి ఏ మాత్రం భయపడటం లేదట.ఫ్యూచర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.దీంతో వరల్డ్ వైడ్ డెవలప్డ్ కంట్రీస్‌లో ‘ది గ్రేట్ రెజిగ్నేషన్’ (మహా ఆర్థిక సంక్షోభం) మొదలైందని చెప్పుకుంటున్నారు.మగవారితో సమానంగా మహిళలు కూడా తమ ఉద్యోగాలను వదులుకుంటున్నారు.

ఇది రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.తాజాగా వెలువడిన సర్వే రిపోర్టు ప్రకారం.

అమెరికా లో ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపుగా 3 శాతం మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.ఆ సంఖ్య 43 లక్షలకు చేరువలో ఉంది.

కరోనా టైంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 13 లక్షలు ఉండగా ప్రస్తుతం ఉద్యోగాలను వదిలేస్తున్న వారి సంఖ్య దానికి రెట్టింపు ఉంది.పురుషుల కంటే మహిళలే రాజీనామాలు చేస్తున్న వారిలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.కంపెనీల టార్చర్ భరించలేకనే చాలా మంది రాజీనామాలు చేస్తున్నట్టు తెలిసింది2020 ఫిబ్రవరి నెలతో పోలిస్తే నేటికీ 32 లక్షల మంది కార్మికులు తక్కువగా ఉన్నారు.ఈ క్రమంలో ఉన్న ఉద్యోగులను కాపాడుకునేందుకు కంపెనీలు వారికి భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

అయితే, కరోనా టైంలో జాబ్ పోగొట్టుకున్న వారికి ఇదే సరైన తరుణమని నిపుణులు చెబుతున్నారు.మార్కెట్లో జాబ్ ఖాళీలు ఎక్కువగా ఉన్నందున కొత్త జాబ్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.

ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన ప్రతి పది మందిలో నలుగురు రెస్టారెంట్లు, రిటైల్ రంగాల్లో పనిచేసే వారే ఉండటం గమనార్హం.

#America #Corona #Employees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube